Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

కీర్తన 83 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


కీర్తన 83
ఒక గీతము. ఆసాపు కీర్తన.

1 ఓ దేవా! మౌనంగా ఉండకండి; ఓ దేవా, మమ్మల్ని పెడచెవిని పెట్టకండి, నిశ్చలంగా ఉండకండి.

2 మీ శత్రువులు ఎలా కేకలు వేస్తున్నారో చూడండి, మిమ్మల్ని ద్వేషించేవారు తలలు పైకెత్తుతున్నారు.

3 వారు మీ ప్రజలకు హాని చేయాలని చూస్తున్నారు; మీరు ఆదరించే వారికి వ్యతిరేకంగా వారు కుట్రలు చేస్తారు.

4 “రండి, వారి దేశాన్ని లేకుండ నాశనం చేద్దాం అప్పుడు ఇశ్రాయేలీయుల పేరు ఇక జ్ఞాపకం ఉండదు” అని వారు అంటున్నారు.

5 వారు ఏకమనస్సుతో కుట్ర చేశారు; వారు మీకు వ్యతిరేకంగా ఒప్పందం చేసుకున్నారు.

6 గుడారాల్లో నివసించే ఎదోమీయులు, ఇష్మాయేలీయులు, మోయాబీయులు, హగ్రీయీలు,

7 గెబాలు, అమ్మోను అమాలేకు, ఫిలిష్తియా, తూరు ప్రజలతో ఒప్పందం చేసుకున్నారు.

8 లోతు వారసులను బలోపేతం చేయడానికి అష్షూరు కూడా వారితో చేరింది. సెలా

9 మిద్యానుకు చేసినట్లుగా, కీషోను నది దగ్గర సీసెరా యాబీనుకు చేసినట్లుగా వారికి చేయండి.

10 వారు ఎన్-దోరు దగ్గర నశించారు నేల మీద పేడలా అయ్యారు.

11 ఓరేబుకు జెయేబుకు చేసినట్లు వారి సంస్థానాధిపతులకు జెబహుకు సల్మున్నాకు వారి యువరాజులందరికి చేయండి.

12 వారు, “దేవుని పచ్చికబయళ్లను స్వాధీనం చేసుకుందాం” అని అన్నారు.

13 నా దేవా, వారిని సుడి తిరిగే దుమ్ములా, గాలి ముందు కొట్టుకుపోయే పొట్టులా చేయండి.

14 అగ్ని అడవిని దహించునట్లు కారుచిచ్చు పర్వతాలను తగలబెట్టినట్లు,

15 మీ తుఫానుతో వారిని వెంటాడండి మీ సుడిగాలితో వారిని భయపెట్టండి.

16 వారు మీ నామాన్ని వెదకునట్లుగా, యెహోవా, సిగ్గుతో వారి ముఖాలు కప్పండి.

17 వారు ఎప్పటికీ సిగ్గుపడాలి భయపడాలి; వారు అవమానంలో నశించెదరు గాక.

18 యెహోవా అనే నామం గల మీరు భూమి మీద అందరిలో మహోన్నతుడవని వారు తెలుసుకోవాలి.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan