Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

కీర్తన 48 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


కీర్తన 48
ఒక గీతము. కోరహు కుమారుల కీర్తన.

1 మన దేవుని పట్టణంలో ఆయన పరిశుద్ధ పర్వతం మీద యెహోవా గొప్పవాడు, అధిక స్తోత్రార్హుడు.

2 మహారాజు పట్టణమైన సీయోను పర్వతం సాఫోన్ ఎత్తైన స్థలంలా అందంగా కనిపిస్తూ సర్వలోకానికి ఆనందం కలిగిస్తుంది.

3 దేవుడు ఆమె కోటలలో ఉన్నారు; ఆయనే దానికి కోట అని చూపించారు.

4 రాజులు దళాలతో కలిసి, వారు ముందుకు వచ్చినప్పుడు,

5 వారు దాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు; వారు భయంతో పారిపోయారు.

6 వారిలో వణుకు పుట్టింది, ప్రసవ వేదనలాంటి బాధ వారికి కలిగింది.

7 తూర్పు గాలితో బద్దలైన తర్షీషు ఓడల్లా మీరు వారిని నాశనం చేశారు.

8 మనం విన్నదే, మనం చూశాం; సైన్యాల యెహోవా పట్టణంలో, మన దేవుని పట్టణంలో, దేవుడు దాన్ని నిత్యం సుస్థిరంగా ఉండేలా చేస్తారు. సెలా

9 దేవా! మీ మందిరం మధ్యలో మీ మారని ప్రేమను మేము ధ్యానిస్తాము.

10 ఓ దేవా, మీ పేరులా, మీ స్తుతి భూదిగంతాలకు చేరుతుంది; మీ కుడిచేయి నీతితో నిండి ఉంది.

11 మీ తీర్పులను బట్టి సీయోను పర్వతం ఆనందిస్తుంది యూదా పట్టణాలు సంతోషంగా ఉన్నాయి.

12 సీయోను వైపు వెళ్లండి, దాని చుట్టూ నడవండి, దాని బురుజులెన్నో లెక్కించండి.

13 ఆమె గురించి రాబోయే తరం వారికి మీరు చెప్పగలిగేలా, దాని కోటగోడలను పరిశీలించండి, దాని కోటలను చూడండి.

14 ఈ దేవుడు ఎప్పటికీ మన దేవుడు; ఆయన చివరి వరకు నడిపిస్తారు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan