Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

కీర్తన 130 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


కీర్తన 130
యాత్రకీర్తన.

1 యెహోవా, లోతైన స్థలంలో నుండి నేను మీకు మొరపెడతాను;

2 ప్రభువా, నా స్వరం వినండి. దయ కోసం నేను చేసే మొర మీ చెవులు శ్రద్ధతో విననివ్వండి.

3 యెహోవా, మీరు పాపాలను లెక్కిస్తే, ప్రభువా, ఎవరు నిలవగలరు?

4 కాని మీ దగ్గర క్షమాపణ లభిస్తుంది, కాబట్టి మేము భయభక్తులు కలిగి మిమ్మల్ని సేవించగలము.

5 యెహోవా కోసం నేను ఉన్నాను, ఆయన కోసం నా ప్రాణం కనిపెట్టుకొని ఉంది, ఆయన మాటలో నేను నిరీక్షణ ఉంచాను.

6 కావలివారు ఉదయం కోసం ఎదురు చూసే దానికన్నా ఎక్కువగా అవును, కావలివారు ఉదయం కోసం ఎదురు చూసే దానికన్నా ఎక్కువగా, నేను ప్రభువు కోసం ఎదురు చూస్తున్నాను.

7 ఓ ఇశ్రాయేలూ, యెహోవా మీద నీ నిరీక్షణ ఉంచు, ఎందుకంటే యెహోవా దగ్గర మారని ప్రేమ లభిస్తుంది ఆయన దగ్గర పూర్తి విమోచన దొరుకుతుంది.

8 ఆయనే ఇశ్రాయేలీయులను వారి అన్ని పాపాల నుండి విడిపిస్తారు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan