కీర్తన 110 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదంకీర్తన 110 దావీదు కీర్తన. 1 యెహోవా నా ప్రభువుతో చెప్పిన మాట: “నేను నీ శత్రువులను నీ పాదపీఠంగా చేసే వరకు నీవు నా కుడిచేతి వైపున కూర్చో.” 2 యెహోవా, “నీ శత్రువుల మధ్య పరిపాలించు!” అని అంటూ, సీయోను నుండి మీ శక్తివంతమైన రాజదండాన్ని విస్తరిస్తూ, అంటారు, 3 మీ యుద్ధ దినాన మీ దళాలు ఇష్టపూర్వకంగా వస్తాయి. పవిత్ర వైభవాన్ని ధరించుకున్నవారై ఉదయపు గర్భం నుండి మంచులా మీ యువకులు మీ దగ్గరకు వస్తారు. 4 “మెల్కీసెదెకు క్రమంలో, నీవు నిరంతరం యాజకునిగా ఉన్నావు” అని యెహోవా ప్రమాణం చేశారు ఆయన తన మనస్సు మార్చుకోరు. 5 ప్రభువు మీ కుడి ప్రక్కనే ఉన్నాడు; తన ఉగ్రత దినాన ఆయన రాజులను తుత్తునియలుగా చేస్తాడు. 6 అతడు దేశాలను శిక్షిస్తాడు వారి భూములను శవాలతో నింపుతాడు; అతడు సర్వ భూమిపై పాలకులను ముక్కలు చేస్తాడు. 7 దారిలో అతడు వాగు నీళ్లు త్రాగుతాడు, కాబట్టి అతడు తల పైకెత్తుతాడు. |
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica, Inc.