Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

కీర్తన 100 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


కీర్తన 100
స్తుతి అర్పణ కీర్తన

1 భూలోకమంతా యెహోవాను స్తుతిస్తూ ఆనంద ధ్వనులు చేయాలి.

2 సంతోష పూర్వకంగా యెహోవాను సేవించండి; పాడుతూ ఆయన సన్నిధిలోకి రండి.

3 యెహోవాయే దేవుడని గ్రహించండి. ఆయనే మన సృష్టికర్త, మనం ఆయన వారం; మనం ఆయన ప్రజలం, ఆయన మేపే గొర్రెలం.

4 కృతజ్ఞతతో ఆయన ద్వారాల గుండా ప్రవేశించండి, స్తుతితో ఆయన ఆవరణంలోకి ప్రవేశించండి; ఆయనకు వందనాలు చెల్లించండి, ఆయన నామమును స్తుతించండి.

5 యెహోవా మంచివారు ఆయన మారని ప్రేమ శాశ్వతమైనది; ఆయన నమ్మకత్వం తరతరాలకు ఉంటుంది.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan