Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

సామెతలు 19 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 నిజాయితీ లేనివాడు మూర్ఖుడు కావడం కంటే నిజాయితీగా ఉంటే మంచిది.

2 ఒక వ్యక్తి తెలివిలేనివాడుగా ఉండడం మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును.

3 ఒక వ్యక్తి యొక్క మూర్ఖత్వం వారి నాశనానికి దారితీస్తుంది, వారి హృదయంలో వారికి యెహోవా మీద కోపం వస్తుంది.

4 డబ్బుగల వానికి స్నేహితులు ఎక్కువగా ఉందురు, పేదవాడు తన స్నేహితులను పోగొట్టుకుంటాడు.

5 అబద్ధసాక్షి శిక్షను పొందక పోదు అబద్ధాలాడే వాడు తప్పించుకోడు.

6 అనేకులు గొప్పవారి దయ వెదుకుతారు, బహుమతులు ఇచ్చేవారికి ప్రతి ఒక్కరూ స్నేహితులే.

7 పేదవారిని తమ బంధువులందరు దూరంగా ఉంచుతారు, అలాంటప్పుడు వారి స్నేహితులు ఇంకెంత దూరంగా ఉంచుతారు! పేదవారు బ్రతిమిలాడుతూ వారిని వెంటాడినా, వారు ఎక్కడా కనిపించలేదు.

8 తెలివి సంపాదించుకునేవారు తన ప్రాణమునకు ప్రేమించేవారు; మంచి చెడులను లెక్కచేయువారు మేలు పొందును.

9 అబద్ధపు సాక్షి శిక్షను పొందును, అబద్ధాలాడే వాడు నశించును.

10 భోగములను అనుభవించుట బుద్ధిలేని వానికి తగదు, రాజుల మీద పెత్తనము చెలాయించుట పనివానికి బొత్తిగా తగదు.

11 ఒక వ్యక్తి తెలివి వానికి ఓర్పును కలిగిస్తుంది; ఒక నేరాన్ని పట్టించుకోకపోవడం ఒక వ్యక్తికి ఘనత కలిగిస్తుంది.

12 రాజు కోపం సింహగర్జన వంటిది, అతని దయ తుక్కు మీద కురియు మంచు వంటిది.

13 బుద్ధిహీనుని పిల్లలు తన తండ్రికి నష్టము తెచ్చును, భార్యతోటిపోరు ఆగకుండా పడుచుండు నీటిబొట్లతో సమానము.

14 ఇల్లు సంపద పితరులు ఇచ్చిన స్వాస్థ్యం, వివేకంగల భార్య యెహోవా యొక్క దానము.

15 సోమరితనం గాఢనిద్ర కలుగజేస్తుంది, సోమరివాడు తిండి లేక ఉంటాడు.

16 ఆజ్ఞను పాటించేవాడు తనను తాను కాపాడుకుంటాడు, కానీ తన ప్రవర్తన విషయంలో జాగ్రత్తలేనివాడు చస్తాడు.

17 బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు, వాని ఉపకారానికి ఆయన తిరిగి ఉపకారం చేస్తారు.

18 ఎందుకంటే అందులో ఆశ ఉన్నప్పుడే మీ పిల్లలను క్రమశిక్షణ చేయండి; అయితే వాడు మరణించాలని కోరుకోవద్దు.

19 మహా కోపం గలవాడు శిక్ష తప్పించుకోడు, వాని తప్పించినను వాడు మరల కోప్పడుతూనే ఉంటాడు.

20 నీవు ముందుకు జ్ఞానివగుటకై, ఆలోచన విని బోధను అంగీకరించు.

21 ఒక వ్యక్తి హృదయంలో ఆలోచనలు అనేకంగా పుడతాయి, అయితే యెహోవా ఉద్దేశమే స్థిరము.

22 ఒక వ్యక్తి కోరుకునేది నమ్మకమైన ప్రేమను, అబద్ధికునిగా కంటే పేదవానిగా ఉండడం మేలు.

23 యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం జీవమునకు దారి; అది కలిగినవాడు తృప్తి కలిగినవాడై అపాయం లేకుండా బ్రతుకును.

24 సోమరి పాత్రలో చేయి ముంచునేగాని; తన నోటికి దాని తిరిగి ఎత్తనైనా ఎత్తడు.

25 ఎగతాళి చేసేవారు శిక్షింపబడగా చూసి సామాన్యులు వివేకం నేర్చుకుంటారు; మంచిచెడులు నెరిగిన వారిని గద్దింపగా వారు తెలివిని అభివృద్ధి చేసికొందురు.

26 తండ్రిని దోచుకునేవాడు, తల్లిని వెళ్లగొట్టేవాడు, అవమానాన్ని అపకీర్తిని కలుగజేసేవాడు.

27 నా కుమారుడా, ఒకవేళ నీవు ఉపదేశాన్ని వినుట మానిన ఎడల, నీవు తెలివిగల మాటల నుండి తప్పిపోతావు.

28 అవినీతిపరుడైన సాక్షి న్యాయాన్ని ఎగతాళి చేస్తాడు, దుష్టుల నోరు పాపాన్ని జుర్రుకొంటుంది.

29 హేళన చేయువారికి తీర్పులును బుద్ధిలేని వారి వీపులకు దెబ్బలను ఏర్పాటు చేయబడినవి.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan