Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 థెస్సలొనీకయులకు 1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 తండ్రియైన దేవునికి ప్రభువైన యేసు క్రీస్తుకు చెందిన థెస్సలొనీకయుల సంఘానికి, పౌలు, సీల, తిమోతి అనే మేము వ్రాయునది: మీకు కృపా సమాధానాలు కలుగును గాక.


థెస్సలొనీకయుల విశ్వాసాన్నిబట్టి కృతజ్ఞతలు

2 మేము ప్రార్థించిన ప్రతిసారి మీ అందరి గురించి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము.

3 దేవునిపై మీకున్న విశ్వాసంతో చేసిన కార్యాలు, ప్రేమ చేత ప్రేరేపించబడిన మీ ప్రయాసం, మన ప్రభువైన యేసు క్రీస్తులో మీకున్న నిరీక్షణ వలన మీరు చూపుతున్న ఓర్పును మేము మన తండ్రియైన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకుంటున్నాము.

4 దేవుని ప్రేమను పొందిన సహోదరీ సహోదరులారా, దేవుడు మిమ్మల్ని ఆయన ప్రజలుగా ఎన్నుకున్నాడనే సంగతి మాకు తెలుసు.

5 ఎందుకంటే, మేము మీకు సువార్తను కేవలం సాధారణ మాటలతో కాక పరిశుద్ధాత్మ శక్తితో బలమైన విశ్వాసంతో ప్రకటించాము. మీ గురించి మేము మీ మధ్యలో ఎలా జీవించామో మీకు తెలుసు.

6 మీరు తీవ్రమైన శ్రమల మధ్యలో పరిశుద్ధాత్మలోని సంతోషంతో వాక్యాన్ని స్వీకరించి, మమ్మల్ని ప్రభువును పోలి నడుచుకుంటున్నారు.

7 కాబట్టి మాసిదోనియ అకాయ ప్రాంతాల్లో ఉన్న విశ్వాసులందరికి మీరు మాదిరిగా ఉన్నారు.

8 అందుకని మీ వలన ప్రభువును గురించిన వాక్యం కేవలం మాసిదోనియ అకాయ ప్రాంతాల్లో మారుమ్రోగడమే కాకుండా మీలో దేవునిపై ఉన్న విశ్వాసాన్ని గురించి ప్రతిచోట తెలిసింది. కాబట్టి దాని గురించి మేము చెప్పవలసిన అవసరం లేదు,

9 ఎందుకంటే మీరు మాకు ఇచ్చిన ఆతిథ్యం ఎలాంటిదో వారే సాక్ష్యమిస్తున్నారు. సజీవుడైన నిజమైన దేవున్ని సేవించడానికి మీరు విగ్రహాలను విడిచిపెట్టి ఎలా దేవుని వైపుకు తిరిగారో,

10 మరణం నుండి ఆయన లేపిన, రాబోయే ఉగ్రత నుండి మనల్ని కాపాడబోవుచున్న, పరలోకం నుండి రాబోతున్న ఆయన కుమారుడైన యేసు కోసం మీరు ఎంతగా ఎదురుచూస్తున్నారో వారే చెప్తున్నారు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan