Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 దిన 24 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


యాజకుల విభాగాలు

1 ఇవి అహరోను వారసుల విభాగాలు: అహరోను కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు.

2 నాదాబు, అబీహు కుమారులు లేకుండానే తమ తండ్రి కంటే ముందే చనిపోయారు; కాబట్టి ఎలియాజరు, ఈతామారు యాజకులుగా సేవ చేశారు.

3 ఎలియాజరు వారసుడైన సాదోకు, ఈతామారు వారసుడైన అహీమెలెకు సహాయంతో, వారికి నియమించబడిన సేవా క్రమంలో, దావీదు వారిని విభాగించాడు.

4 ఈతామారు వారసులలో కంటే ఎలియాజరు వారసులలో ఎక్కువ మంది నాయకులు ఉన్నారు కాబట్టి దాని ప్రకారం ఎలియాజరు వారసులలో పదహారుగురు కుటుంబ పెద్దలు, ఈతామారు వారసులలో ఎనిమిది మంది కుటుంబ పెద్దలుగా నియమించబడ్డారు.

5 ఎలియాజరు వారసులలో, ఈతామారు వారసులలో పరిశుద్ధాలయ అధికారులుగా, దేవుని సేవకులుగా ఉన్నారు కాబట్టి, పక్షపాతం లేకుండా చీట్లు వేసి వారిని విభాగించారు.

6 లేవీయులలో లేఖికునిగా ఉన్న నెతనేలు కుమారుడైన షెమయా, వారి పేర్లను రాజు, అతని అధికారులు యాజకుడైన సాదోకు, అబ్యాతారు కుమారుడైన అహీమెలెకు, యాజకుల కుటుంబ పెద్దలు, లేవీయుల ఎదుట నమోదు చేశాడు. ఒక కుటుంబం ఎలియాజరు నుండి, తర్వాత మరొక కుటుంబం ఈతామారు నుండి తీసుకోబడింది.

7 మొదటి చీటి యెహోయారీబుకు, రెండవది యెదాయాకు,

8 మూడవది హారీముకు, నాలుగవది శెయొరీముకు,

9 అయిదవది మల్కీయాకు, ఆరవది మీయామినుకు,

10 ఏడవది హక్కోజుకు, ఎనిమిదవది అబీయాకు,

11 తొమ్మిదవది యెషూవకు, పదవది షెకన్యాకు,

12 పదకొండవది ఎల్యాషీబుకు, పన్నెండవది యాకీముకు,

13 పదమూడవది హుప్పాకు, పద్నాలుగవది యెషెబాబుకు,

14 పదిహేనవది బిల్గాకు, పదహారవది ఇమ్మేరుకు,

15 పదిహేడవది హెజీరుకు, పద్దెనిమిదవది హప్పిస్సేసుకు,

16 పందొమ్మిదవది పెతహయాకు, ఇరవయ్యవది యెహెజ్కేలుకు,

17 ఇరవై ఒకటవది యాకీనుకు, ఇరవై రెండవది గామూలుకు,

18 ఇరవై మూడవది దెలాయ్యాకు, ఇరవై నాలుగవది మయజ్యాకు వచ్చాయి.

19 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారి పితరుడైన అహరోనుకు ఆజ్ఞాపించిన ప్రకారం, అహరోను వారికి నియమించిన నిబంధనల ప్రకారం, వారు యెహోవా మందిరంలో ప్రవేశించినప్పుడు వారు చేయాల్సిన సేవా క్రమం ఇది.


లేవీయులలో మిగిలినవారు

20 లేవీ వారసులలో మిగిలినవారు: అమ్రాము కుమారుల నుండి: షూబాయేలు; షూబాయేలు కుమారుల నుండి: యెహెద్యాహు.

21 రెహబ్యాకు కుమారుల నుండి పెద్దవాడైన ఇష్షీయా.

22 ఇస్హారీయుల్లో నుండి: షెలోమోతు; షెలోమోతు కుమారుల నుండి: యహతు.

23 హెబ్రోను కుమారులు: యెరీయా మొదటివాడు, అమర్యా రెండవవాడు, యహజీయేలు మూడవవాడు, యెక్మెయాము నాలుగవవాడు.

24 ఉజ్జీయేలు కుమారుడు: మీకా; మీకా కుమారుల నుండి: షామీరు.

25 మీకా సోదరుడు: ఇష్షీయా; ఇష్షీయా కుమారుల నుండి: జెకర్యా.

26 మెరారి కుమారులు: మహలి, మూషి. యహజీయాహు కుమారుడు: బెనో.

27 మెరారి కుమారులు: యహజీయాహు నుండి: బెనో, షోహము, జక్కూరు, ఇబ్రీ.

28 మహలికి నుండి: ఎలియాజరు, ఇతనికి కుమారులు లేరు.

29 కీషు నుండి: కీషు కుమారుడు: యెరహ్మెయేలు.

30 మూషి కుమారులు: మహలి, ఏదెరు, యెరీమోతు. వీరు తమ కుటుంబాల ప్రకారం లేవీయులు.

31 వీరు తమ బంధువులైన అహరోను వారసులు చేసినట్టు, రాజైన దావీదు, సాదోకు, అహీమెలెకు, యాజకులు లేవీయుల కుటుంబ పెద్దలు ఎదుట చీట్లు వేసుకున్నారు. పెద్ద సోదరుని కుటుంబాలు చిన్న సోదరుని కుటుంబాలు కలిసి చీట్లు వేసుకున్నారు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan