కీర్తన 149 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 యెహోవాను స్తుతించండి. యెహోవాకు నూతన గీతం పాడండి. భక్తులు సమకూడే ప్రతిచోటా ఆయనకు స్తుతి గీతాలు పాడండి. 2 ఇశ్రాయేలు ప్రజలు తమ సృష్టికర్తను బట్టి సంతోషిస్తారు గాక. సీయోను ప్రజలు తమ రాజును బట్టి ఆనందిస్తారు గాక. 3 వాళ్ళు నాట్యం చేస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తారు గాక. తంబుర, సితారా మోగిస్తూ ఆయనను గూర్చి ఆనంద గీతాలు గానం చేస్తారు గాక. 4 యెహోవా తన ప్రజలందరినీ అమితంగా ప్రేమిస్తున్నాడు. దీనులైన తన ప్రజలకు రక్షణ భాగ్యం ప్రసాదించాడు. 5 ఆయన భక్తులు ఘనమైన స్థితిలో సంతోషంతో ఉప్పొంగిపోతారు గాక. తమ పడకలపై వాళ్ళు సంతోషంగా పాటలు పాడతారు గాక. 6 దేవుణ్ణి కీర్తించేందుకు వాళ్ళ నోటినిండా ఉత్సాహ గీతాలు ఉన్నాయి. 7 వాళ్ళ చేతుల్లో రెండంచుల ఖడ్గం ఉంది. ఆ ఖడ్గం చేబూని వాళ్ళు అన్యులకు ప్రతీకారం చేస్తారు, వాళ్ళను శిక్షిస్తారు. 8 వాళ్ళ రాజులను గొలుసులతో, వాళ్ళలో ఘనత వహించిన వారిని ఇనుప సంకెళ్లతో బంధిస్తారు. 9 తీర్పులో శిక్ష పొందిన వాళ్లకు శిక్ష అమలు పరుస్తారు. ఆయన భక్తులందరికీ ఈ ఉన్నతమైన గౌరవం దక్కుతుంది. యెహోవాను స్తుతించండి. |
TEL-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.