కీర్తన 142 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019దావీదు దైవధ్యానం. గుహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన 1 నేను గొంతెత్తి యెహోవాకు మొరపెడుతున్నాను. ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకుంటున్నాను. 2 ఆయన సన్నిధిలో దీనంగా నేను వేడుకుంటున్నాను. నాకు కలిగిన బాధలన్నిటినీ ఆయనకు మనవి చేసుకుంటున్నాను. 3 నాలో నా ప్రాణం కృంగి ఉన్నప్పుడు నా స్థితి ఏమిటో నీకు తెలుసు. నన్ను బంధించడానికి నేను నడిచే దారుల్లో శత్రువులు దొంగచాటుగా వల పన్నుతున్నారు. 4 నా కుడి పక్కన చూస్తే నన్ను ఆదరించేవాడు ఒక్కడు కూడా కనిపించలేదు. తప్పించుకునే దారి లేదు. నాప్రాణం గురించి పట్టించుకునే వాడే లేడు. 5 యెహోవా, నేను నీకే మొరపెడుతున్నాను. నన్ను ఆదుకునేది నువ్వే. సజీవులు నివసించే భూమి మీద నా భాగం నువ్వే అంటున్నాను. 6 నా ఆక్రందన ఆలకించు. నేను క్రుంగిపోయి ఉన్నాను. నన్ను తరుముతున్నవాళ్ళు నాకంటే బలవంతులు. వాళ్ళ చేతుల్లో పడకుండా నన్ను కాపాడు. 7 నేను నీ నామాన్ని కీర్తించేలా చెరలోనుండి నా ప్రాణాన్ని తప్పించు. అప్పుడు నీవు నాకు చేసిన మహోపకారాన్ని బట్టి నీతిమంతులు నా చుట్టూ చేరి ఆనందిస్తారు. |
TEL-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.