కీర్తన 133 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019దావీదు రాసిన యాత్రల కీర్తన 1 చూడండి, సోదరులు ఐక్యంగా కలసి ఉండడం ఎంత మంచిది! ఎంత రమ్యమైనది! 2 అది ఆహరోను తలమీద పోసిన పరిమళ తైలం వంటిది. అది అహరోను గడ్డం నుండి అతడి అంగీ అంచులదాకా కారుతూ ఉన్న పరిమళ తైలం వంటిది. 3 అది సీయోను కొండల మీదికి దిగి వచ్చే హెర్మోను పర్వతం మంచులాంటిది. అక్కడ ఆశీర్వాదం ఉంటుందనీ అది శాశ్వతంగా నిలిచి ఉండే జీవమనీ యెహోవా సెలవిచ్చాడు. |
TEL-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.