యెషయా 58:7 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 మీ ఆహారాన్ని ఆకలితో ఉన్నవారితో పంచుకోవడం, ఇల్లు లేక తిరుగుతున్న పేదలకు ఆశ్రయం కల్పించడం, మీరు ఎవరినైనా నగ్నంగా చూస్తే, వారికి బట్టలు ఇవ్వడం, మీ రక్తసంబంధులకు ముఖం దాచకపోవడమే కదా ఉపవాసం? See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7-8 నీ ఆహారము ఆకలిగొనినవారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ యింట చేర్చుకొనుటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము లిచ్చుటయు ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము? ఆలాగున నీవు చేసినయెడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడచును యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 ఆకలితో అలమటించే వాళ్లతో నీ ఆహారం పంచుకోవడం, ఇల్లు లేకుండా తిరిగే పేదవారిని నీ ఇంట్లోకి చేర్చుకోవడం. దిగంబరిగా నీకెవరైనా కనిపిస్తే, వాడికి బట్టలు ఇవ్వు. నీ సొంత బంధువులకు నీ ముఖం చాటేయవద్దు. See the chapterపవిత్ర బైబిల్7 ఆకలిగొన్న ప్రజలతో మీరు మీ భోజనం పంచుకోవాలని నేను కోరుతున్నాను. ఇళ్లులేని పేద ప్రజలను మీరు వెదికి, వారిని మీరు మీ స్వంత ఇళ్లలోనికి తీసుకొని రావాలని నేను కోరుతున్నాను. బట్టలు లేనివాడ్ని మీరు చూచినప్పుడు, మీ బట్టలు వానికి ఇవ్వండి. ఆ మనుష్యులకు సహాయం చేయకుండా దాచుకోవద్దు; వాళ్లూ మీలాంటి వారే.” See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 మీ ఆహారాన్ని ఆకలితో ఉన్నవారితో పంచుకోవడం, ఇల్లు లేక తిరుగుతున్న పేదలకు ఆశ్రయం కల్పించడం, మీరు ఎవరినైనా నగ్నంగా చూస్తే, వారికి బట్టలు ఇవ్వడం, మీ రక్తసంబంధులకు ముఖం దాచకపోవడమే కదా ఉపవాసం? See the chapter |