2 రాజులు 2:2 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 అప్పుడు ఏలీయా ఎలీషాతో, “నీవు ఇక్కడే ఉండు; యెహోవా నన్ను బేతేలుకు వెళ్లమన్నారు” అని చెప్పాడు. అయితే ఎలీషా, “సజీవుడైన యెహోవా మీద, నీ మీద ప్రమాణం చేసి చెప్తున్న, నేను నిన్ను విడువను” అన్నాడు. కాబట్టి వారు బేతేలుకు వెళ్లారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 ఏలీయా– యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చియున్నాడు గనుక నీవు దయచేసి యిక్కడ నుండుమని ఎలీషాతో అనెను. ఎలీషా–యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 అప్పుడు ఏలీయా “నీవు దయచేసి ఇక్కడే నిలిచిపో. నన్ను బేతేలుకు వెళ్ళమని యెహోవా చెప్పాడు” అని ఎలీషాతో అన్నాడు. దానికి ఎలీషా “యెహోవా ప్రాణం మీదా నీ ప్రాణం మీదా ఒట్టేసి చెబుతున్నాను. నేను నిన్ను విడిచి పెట్టను” అని జవాబిచ్చాడు. కాబట్టి వాళ్ళిద్దరూ బేతేలుకు వెళ్ళారు. See the chapterపవిత్ర బైబిల్2 ఎలీషాతో, “దయచేసి ఇక్కడ వుండుము, ఎందుకనగా యెహోవా నన్ను బేతేలునకు వెళ్లుమని ఆదేశించాడు” అని చెప్పాడు. కాని ఎలీషా, “యెహోవా జీవంతోడు, నా జీవం తోడు నేను నిన్ను విడిచి వెళ్లను” అని ఏలీయాతో చెప్పాడు. అందువల్ల ఆ ఇద్దరు మనష్యులు బేతేలుకు వెళ్లారు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 అప్పుడు ఏలీయా ఎలీషాతో, “నీవు ఇక్కడే ఉండు; యెహోవా నన్ను బేతేలుకు వెళ్లమన్నారు” అని చెప్పాడు. అయితే ఎలీషా, “సజీవుడైన యెహోవా మీద, నీ మీద ప్రమాణం చేసి చెప్తున్న, నేను నిన్ను విడువను” అన్నాడు. కాబట్టి వారు బేతేలుకు వెళ్లారు. See the chapter |