Online Bible

- Advertisements -




1 సమూయేలు 7:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 వారు మిస్పాకు చేరుకుని వారు నీళ్లు తీసుకువచ్చి యెహోవా సన్నిధిలో కుమ్మరించారు. ఆ రోజున వారు ఉపవాసం ఉండి, “యెహోవాకు వ్యతిరేకంగా మేము పాపం చేశాము” అని ఒప్పుకున్నారు. సమూయేలు మిస్పాలో ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా సేవ చేస్తున్నాడు.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 వారు మిస్పాలో కూడుకొని నీళ్లుచేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి–యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచువచ్చెను.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 వారు మిస్పాలో సమావేశమై నీళ్లు చేది యెహోవా సన్నిధిలో కుమ్మరించి ఆ రోజంతా ఉపవాసం ఉండి “యెహోవా దృష్టిలో మేమంతా పాపం చేశాం” అని ఒప్పుకున్నారు. సమూయేలు మిస్పాలో ఉంటూ ఇశ్రాయేలీయులకు తీర్పు తీరుస్తూ న్యాయం జరిగిస్తున్నాడు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

6 ఇశ్రాయేలీయులు మిస్పావద్ద సమావేశం అయ్యారు. వారు నీళ్లు తెచ్చి యెహోవా ముందర పారపోసారు. (ఈ విధంగా వారు ఉపవాసం ప్రారంభించారు.) ఆ రోజు వారు ఏమీ తినకుండా ఉండి, వారి పాపాలు ఒప్పుకోవటం మొదలు పెట్టారు. “మేము యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసాము” అని వారు చెప్పారు. కనుక సమూయేలు ఇశ్రాయేలీయులకు ఒక న్యాయాధిపతిగా సేవ చేయటం మిస్పాలో ప్రారంభించాడు.

See the chapter Copy

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 వారు మిస్పాకు చేరుకుని వారు నీళ్లు తీసుకువచ్చి యెహోవా సన్నిధిలో కుమ్మరించారు. ఆ రోజున వారు ఉపవాసం ఉండి, “యెహోవాకు వ్యతిరేకంగా మేము పాపం చేశాము” అని ఒప్పుకున్నారు. సమూయేలు మిస్పాలో ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా సేవ చేస్తున్నాడు.

See the chapter Copy




1 సమూయేలు 7:6

Follow us:

Advertisements


Advertisements