ఆదికాండము 34:7 - పవిత్ర బైబిల్7 జరిగినదాన్ని గూర్చి యాకోబు కుమారులకు పొలంలోనే తెలిసింది. ఇది విని వాళ్లకు చాలా కోపం వచ్చింది. యాకోబు కూతురుతో షెకెము శయనించి, ఇశ్రాయేలీయుల వంశానికి అవమానం తెచ్చాడు గనుక వారికి పిచ్చి కోపం రెచ్చిపోయింది. షెకెము చాలా చెడ్డపని చేశాడు కనుక ఆ సోదరులంతా పొలాలనుండి వచ్చేశారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలములోనుండి వచ్చిరి. అతడు యాకోబు కుమార్తెతో శయనించి ఇశ్రాయేలు జనములో అవమానకరమైన కార్యము చేసెను; అది చేయరాని పని గనుక ఆ మనుష్యులు సంతాపము పొందిరి, వారికి మిగుల కోపమువచ్చెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలం నుండి తిరిగి వచ్చారు. అతడు యాకోబు కూతురును మానభంగం చేసి ఇశ్రాయేలు ప్రజలను కించపరిచాడు. అది చేయకూడని పని కాబట్టి అది వారికి చాలా అవమానకరంగా ఉంది. వారికి చాలా కోపం వచ్చింది. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 ఇంతలో యాకోబు కుమారులు జరిగిన సంగతి విన్న వెంటనే పొలాల నుండి వచ్చేశారు. ఇశ్రాయేలులో జరగకూడని దారుణమైన సంఘటన, యాకోబు కుమార్తెను షెకెము బలత్కారం చేశాడని వారు ఆశ్చర్యానికి గురై ఆగ్రహంతో ఉన్నారు. See the chapterBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 ఇంతలో యాకోబు కుమారులు జరిగిన సంగతి విన్న వెంటనే పొలాల నుండి వచ్చేశారు. ఇశ్రాయేలులో జరగకూడని దారుణమైన సంఘటన, యాకోబు కుమార్తెను షెకెము బలత్కారం చేశాడని వారు ఆశ్చర్యానికి గురై ఆగ్రహంతో ఉన్నారు. See the chapter |