Online Bible

- Advertisements -

ప్రసంగి 9:2 - పవిత్ర బైబిల్

2 అయితే, మనుష్యులందరికీ ఉమ్మడి అంశం ఒకటుంది మనుష్యులందరూ మరణించడమే అది! మంచివాళ్లూ మరణిస్తారు, చెడ్డవాళ్లూ మరణిస్తారు. చావు పరిశుద్ధులకీ వస్తుంది అపరిశుద్ధులకీ వస్తుంది. చావు బలులు ఇచ్చేవాళ్లకీ వస్తుంది, ఇవ్వనివాళ్లకీ వస్తుంది. పాపి ఎలా చనిపోతాడో, మంచివాడూ సరిగ్గా అలాగే చనిపోతాడు. దేవునికి ప్రత్యేకమైన ప్రమాణాలు చేసేవాళ్లూ ఆ ప్రమాణాలు చెయ్యనివాళ్ల మాదిరిగానే చనిపోతారు.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

2 సంభవించునవి అన్నియు అందరికిని ఏకరీతిగానే సంభవించును; నీతిమంతులకును దుష్టులకును, మంచివారికిని పవిత్రులకును అపవిత్రులకును బలులర్పించువారికిని బలులనర్పింపనివారికిని గతియొక్కటే; మంచివారికేలాగుననో పాపాత్ములకును ఆలాగుననే తటస్థించును; ఒట్టు పెట్టుకొను వారికేలాగుననో ఒట్టుకు భయపడువారికిని ఆలాగుననే జరుగును.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

2 జరిగేవి అన్నీ, అందరికీ ఒకే విధంగా జరుగుతాయి. నీతిమంతులకు, దుష్టులకు, మంచివారికి, చెడ్డవారికి, పవిత్రులకు, అపవిత్రులకు, బలులర్పించే వారికి, అర్పించని వారికి, అందరికీ ఒకే విధంగా జరుగుతుంది. మంచివారికెలాగో దుర్మార్గులకూ అలాగే జరుగుతుంది. ఒట్టు పెట్టుకొనేవాడు ఎలా చనిపోతున్నాడో ఒట్టు పెట్టుకోడానికి భయపడేవాడూ అలాగే చనిపోతున్నాడు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

2 జరిగేవన్నీ అందరికి ఒకే విధంగా జరుగుతాయి. నీతిమంతులకు దుర్మార్గులకు, మంచివారికి చెడ్డవారికి, అపవిత్రులకు పవిత్రులకు, బలులు అర్పించేవారికి అర్పించని వారికి అందరికి ఒకే విధంగా జరుగుతాయి. మంచివారికి ఎలాగో, పాపాత్ములకు అలాగే జరుగుతుంది; ఒట్టుపెట్టుకునే వారికి, ఒట్టు పెట్టుకోడానికి భయపడేవారికి అలాగే జరుగుతుంది.

See the chapter Copy

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

2 జరిగేవన్నీ అందరికి ఒకే విధంగా జరుగుతాయి. నీతిమంతులకు దుర్మార్గులకు, మంచివారికి చెడ్డవారికి, అపవిత్రులకు పవిత్రులకు, బలులు అర్పించేవారికి అర్పించని వారికి అందరికి ఒకే విధంగా జరుగుతాయి. మంచివారికి ఎలాగో, పాపాత్ములకు అలాగే జరుగుతుంది; ఒట్టుపెట్టుకునే వారికి, ఒట్టు పెట్టుకోడానికి భయపడేవారికి అలాగే జరుగుతుంది.

See the chapter Copy

ప్రసంగి 9:2

Follow us:

Advertisements

Advertisements