Online Bible

- Advertisements -




2 దిన 31:15 - పవిత్ర బైబిల్

15 ఏదెను, మిన్యామీను, యేషూవ, షెమయా, అమర్యా మరియు షెకన్యా అనేవారు కోరేకు సహాయ కులుగా పనిచేశారు. వారంతా యాజకులు నివసించే పట్టణాలలో విశ్వాసపాత్రంగా పనిచేశారు. యాజకులలో ప్రతి వర్గం వారి బంధువులకు సేకరించిన వస్తువులను వారు ఇచ్చేవారు. అవే వస్తువులను మిక్కిలి గొప్పవారికి, అతి పేదవారికి కూడ వారివారి భాగాలను వారు ఇచ్చేవారు.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

15 అతనిచేతిక్రింద ఏదెను మిన్యామీను యేషూవ షెమయా అమర్యా షెకన్యా అనువారు నమ్మకమైనవారు గనుక యాజకుల పట్టణములందు పిన్న పెద్దలైన తమ సహోదరులకు వంతులచొప్పున భాగము లిచ్చుటకు నియమింపబడిరి.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

15 అతని చేతి కింద ఏదెను, మిన్యామీను, యేషూవ, షెమయా, అమర్యా, షెకన్యా అనేవారున్నారు. వారు నమ్మకమైనవారు కాబట్టి యాజకుల పట్టణాల్లో ప్రముఖులనీ సామాన్యులనీ తేడా లేకుండా తమ సోదరులకు వరస క్రమాల ప్రకారం వారి భాగాలను పంచిపెట్టడానికి వారిని నియమించారు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

15 అతని చేతి క్రింద ఏదెను, మిన్యామీను, యెషూవ, షెమయా, అమర్యా, షెకన్యా అనే నమ్మకమైనవారు ఉన్నారు. యాజకుల పట్టణాల్లో తమ సాటి యాజకులని పెద్దలని పిన్నలని భేదం చూపకుండ వారి వారి వరసక్రమాల ప్రకారం వారి భాగాలను నమ్మకంగా పంచిపెట్టారు.

See the chapter Copy

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

15 అతని చేతి క్రింద ఏదెను, మిన్యామీను, యెషూవ, షెమయా, అమర్యా, షెకన్యా అనే నమ్మకమైనవారు ఉన్నారు. యాజకుల పట్టణాల్లో తమ సాటి యాజకులని పెద్దలని పిన్నలని భేదం చూపకుండ వారి వారి వరసక్రమాల ప్రకారం వారి భాగాలను నమ్మకంగా పంచిపెట్టారు.

See the chapter Copy




2 దిన 31:15

Follow us:

Advertisements


Advertisements