Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ఫిలిప్పీయులకు 4:5 - తెలుగు సమకాలీన అనువాదము

5 మీ శాంత స్వభావాన్ని అందరికి స్పష్టంగా తెలియనివ్వండి. ప్రభువు సమీపంగా ఉన్నారు.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

5 మీ సహనమును సకల జనులకు తెలియబడనియ్యుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 మీ సహనం అందరికీ తెలియాలి. ప్రభువు దగ్గరగా ఉన్నాడు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

5 మీరు దయగలవాళ్ళనే పేరు పొందాలి. ప్రభువు త్వరలో రానున్నాడు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 మీ శాంత స్వభావాన్ని అందరికి స్పష్టంగా తెలియనివ్వండి. ప్రభువు సమీపంగా ఉన్నారు.

See the chapter Copy

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 మీ శాంత స్వభావాన్ని అందరికి స్పష్టంగా తెలియనివ్వండి. ప్రభువు సమీపంగా ఉన్నారు.

See the chapter Copy




ఫిలిప్పీయులకు 4:5
25 Cross References  

“అందుకే నేను మీతో చెప్పేది ఏంటంటే, మీరు ఏమి తినాలి ఏమి త్రాగాలి అని, మీ ప్రాణం గురించి గాని, లేక ఏమి ధరించాలి అని మీ దేహాన్ని గురించి గాని చింతించకండి. ఆహారం కంటే ప్రాణం, బట్టల కంటే దేహం గొప్పవి కావా?


కాబట్టి రేపటి గురించి చింతించకండి, ఎందుకంటే రేపటి సంగతి గురించి రేపటి దినమే చింతిస్తుంది. ఏ రోజు కష్టం ఆ రోజుకు సరిపోతుంది.


“అకస్మాత్తుగా వలలో చిక్కినట్లు ఆ దినము మీ మీదికి వస్తుంది, అలా రాకుండా, తిని త్రాగి మత్తెక్కడం వలన మరియు జీవితంలోని ఆందోళనల వలన మీ హృదయాలు బరువెక్కకుండ జాగ్రత్తగా చూసుకోండి.


ప్రభువును ప్రేమించనివారు శపింపబడును గాక! ప్రభువా రమ్ము!


నిజానికి, మీ మధ్యలో తగాదాలు ఉన్నాయంటే మీరు ముందే పూర్తిగా ఓడిపోయారు. కనుక, మీరు దోషులుగా లేదా మోసపోయిన వారిగానే ఉండవచ్చు కాదా?


కనుక నేను తిన్నదే నా సహోదరీ సహోదరులు పాపంలో పడడానికి ఒకవేళ కారణమైతే, వారు పాపంలో పడడానికి నేను కారణం కాకూడదని నేను మళ్ళీ ఎప్పుడు అలాంటి ఆహారాన్ని తినను.


ఆటలలో పాల్గొనే ప్రతివారు కఠినమైన శిక్షణ తీసుకుంటారు. వారు నిత్యం ఉండని కిరీటాన్ని పొందడానికి అంత ప్రయాస పడుతారు, కానీ మనమైతే నిత్యం నిలిచే కిరీటం పొందడం కొరకు ప్రయాస పడుతున్నాము.


క్రీస్తు యొక్క వినయం సౌమ్యతను బట్టి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. పౌలు అనే నేను, మీతో ముఖాముఖిగా ఉన్నపుడు “పిరికివాడిని” కాని మీకు దూరంగా ఉన్నపుడు “ధైర్యశాలిని.”


ప్రభువు రాబోయే దినము వచ్చేసిందని ప్రకటించే ప్రవచనాల ద్వారా గాని నోటిమాటల ద్వారా లేదా ఏదైన ఉత్తరం ద్వారా గాని మీకు తెలిస్తే తొందరపడి కలవరంతో భయపడకండి.


ఎవరినీ నిందించకూడదని, శాంతియుతంగా వివేకం కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరి పట్ల ఎల్లప్పుడూ సౌమ్యంగా మెలగాలని ప్రజలకు జ్ఞాపకం చేయి.


కొందరు అలవాటుగా మానివేసినట్లుగా, మనం కలవడం మానివేయకుండా, ఆ దినం సమీపించడం మీరు చూసినప్పుడు ఇంకా ఎక్కువగా కలుసుకొంటూ, ఒకరినొకరు ప్రోత్సాహించుకుందాం.


“ఎందుకంటే ఇంకాసేపట్లో, రాబోయేవాడు వస్తాడు ఆలస్యం చేయడు.”


క్రీస్తు అనుభవించవలసిన కష్టాలను, దాని వలన వచ్చే మహిమ గురించి వారు ప్రవచించినప్పుడు వారిలో ఉన్న క్రీస్తు ఆత్మ ఏ పరిస్థితులను లేక ఏ సమయాన్ని సూచించాడో వారు తెలుసుకోడానికి ప్రయత్నించారు.


అన్నిటికి అంతం సమీపించింది, కనుక మీరు స్వస్థబుద్ధి కలిగి, మెలకువతో ప్రార్థించండి.


ఈ సంగతుల గురించి సాక్ష్యమిచ్చేవాడు, “నిజమే, నేను త్వరగా వస్తున్నాను!” అంటున్నాడు. ఆమేన్! రండి, ప్రభువైన యేసు!


“ఇదిగో, నేను త్వరగా వస్తున్నాను! ఈ గ్రంథపు చుట్టలో ప్రవచించిన మాటలను పాటించేవారు ధన్యులు!”


Follow us:

Advertisements


Advertisements