Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ఫిలిప్పీయులకు 3:2 - తెలుగు సమకాలీన అనువాదము

2 ఆ కుక్కల విషయంలో జాగ్రత్త, దుష్టమైన పనులు చేసేవారి విషయంలో, శరీరాన్ని ముక్కలుగా ఖండించేవారి విషయంలో జాగ్రత్తగా ఉండండి.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

2 కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదన నాచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

2 కుక్కల విషయం జాగ్రత్త. చెడు పనులు చేసే వారి విషయం జాగ్రత్త. ఛేదించే ఆచారం పాటించే వారి విషయం జాగ్రత్త.

See the chapter Copy

పవిత్ర బైబిల్

2 దుర్మార్గులైన ఆ కుక్కల విషయంలో శరీరాన్ని ముక్కలు చేసే వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

2 ఆ కుక్కల గురించి, ఆ కీడుచేసేవారు, శరీరాన్ని ముక్కలు చేసేవారి గురించి జాగ్రత్త.

See the chapter Copy

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

2 ఆ కుక్కల గురించి, ఆ కీడుచేసేవారు, శరీరాన్ని ముక్కలు చేసేవారి గురించి జాగ్రత్త.

See the chapter Copy




ఫిలిప్పీయులకు 3:2
31 Cross References  

ఆ సమయంలో అనేకులు తమ నమ్మకాన్ని వదులుకొని ఒకరినొకరు ద్వేషించుకొని మోసగించుకుంటారు.


“అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండండి. వారు గొర్రెతోలు కప్పుకొని మీ దగ్గరకు వస్తారు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు.


“పవిత్రమైన వాటిని కుక్కలకు పెట్టకండి. మీ ముత్యాలను పందుల ముందు వేయకండి. మీరు అలా చేస్తే ఆ పందులు తమ కాళ్ళతో వాటిని త్రొక్కివేసి, అవి మీ మీద పడి మిమ్మల్ని ముక్కలుగా చేయవచ్చు.


పైకి మాత్రమే యూదులైనవారు నిజంగా యూదులు కారు; భౌతికంగా బాహ్యంగా పొందిన సున్నతి సున్నతి కాదు.


అలాంటివారు అబద్ధ అపొస్తలులు, మోసపూరితమైన పనివారు, క్రీస్తు అపొస్తలుల్లా వేషం వేసుకున్నవారు.


నా సహోదరీ సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారు. అయితే మీ స్వాతంత్ర్యాన్ని శరీరాశలను నెరవేర్చడానికి ఉపయోగించకుండా, ప్రేమ కలిగి వినయంతో ఒకరికొకరు పరిచర్య చేసుకోండి.


ఒకవేళ మీరు ఒకరినొకరు కరచుకొని మ్రింగివేస్తున్నట్లయితే, జాగ్రత్త పడండి లేదా ఒకరి ద్వారా ఒకరు నాశనం అవుతారు.


యేసుక్రీస్తులో ఉన్నవారు సున్నతి పొందినా పొందకపోయినా దానివల్ల ప్రయోజనమేమి ఉండదు. కేవలం ప్రేమ ద్వారా వ్యక్తపరచబడే విశ్వాసం మాత్రమే లెక్కించబడుతుంది.


వారి గమ్యం నాశనం, వారి కడుపే వారికి దేవుడు, తాము సిగ్గుపడవలసిన వాటిలో వారు గర్వపడుతున్నారు. భూసంబంధమైన వాటిపైనే తమ మనస్సు ఉంచుతున్నారు.


ఎందుకంటే, మనం సున్నతి పొందినవారం, దేవుని ఆత్మ చేత ఆయనను ఆరాధిస్తాం, క్రీస్తు యేసులో అతిశయపడతాం, శరీరంపై నమ్మకం ఉంచండి.


మనం మంచి మనస్సాక్షిని విశ్వాసాన్ని కలిగివుంటేనే పోరాడగలం, అయితే కొందరు విశ్వాసాన్ని వదిలిపెట్టి తమ జీవితనావను నాశనం చేసుకున్నారు.


వారు దేవుని నమ్ముతున్నామని చెప్తున్నా, తమ పనుల ద్వారా ఆయనను తిరస్కరిస్తారు. వారు హేయమైనవారు, అవిధేయులు, ఏ మంచిని చేయడానికైనా అనర్హులు.


“కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడుగబడిన పంది బురదలో దొర్లడానికి మళ్లినట్లు” అనే సామెతలు వీరి విషయంలో నిజం.


ఎవరి తీర్పైతే చాలాకాలం క్రితమే వ్రాయబడిందో వారు రహస్యంగా మీ మధ్యలో చొరబడ్డారు. వారు వ్యభిచారంలో జీవించడానికి మన దేవుని కృపను దుర్వినియోగం చేస్తూ, మన ఏకైక సర్వాధికారియైన ప్రభువగు యేసుక్రీస్తును తిరస్కరించిన భక్తిహీనులు.


నీ శ్రమలు, నీ పేదరికం నాకు తెలుసు అయినా నీవు ధనవంతుడవే! తాము యూదులు కాకుండానే యూదులమని చెప్పుకొనే సాతాను సమాజం వారు నీకు విరుద్ధంగా పలికే దూషణ నాకు తెలుసు.


అయితే పిరికివారు, అవిశ్వాసులు, దుష్టులు, హంతకులు, లైంగిక నైతికత లేనివారు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరు అగ్ని గంధకాలతో మండుతున్న సరస్సు పాలవుతారు. ఇది వారికి రెండవ మరణం” అని చెప్పాడు.


అయితే మాంత్రికులు, లైంగిక ఆశలకు లోనైన వారు, హంతకులు, విగ్రహాలను పూజించే వారు, అబద్ధాలు చెప్తూ వాటిని ప్రేమించే వారందరు ఆ పట్టణానికి బయట ఉండే కుక్కలు.


యూదులు కాకపోయినా తాము యూదులం అని అబద్ధాలు చెప్పుకొనే సాతాను సమాజానికి చెందిన వారందరిని నీ దగ్గరకు రప్పించి నీ పాదాల ముందు సాగిలపడి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని వారు ఒప్పుకొనేలా చేస్తాను.


Follow us:

Advertisements


Advertisements