Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ఫిలిప్పీయులకు 3:14 - తెలుగు సమకాలీన అనువాదము

14 క్రీస్తు యేసులో దేవుని ఉన్నత పిలుపు వలన కలిగే బహుమానాన్ని గెలవడానికి, లక్ష్యం వైపే పరుగెడుతున్నాను.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

14 క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

14 క్రీస్తు యేసులో దేవుని ఉన్నతమైన పిలుపుకు సంబంధించిన బహుమతి కోసం గురి దగ్గరకే పరుగెత్తుతూ ఉన్నాను.

See the chapter Copy

పవిత్ర బైబిల్

14 గమ్యాన్ని చేరుకొని బహుమతి పొందాలని ముందుకు పరుగెత్తుతున్నాను. దేవుడు నేను ఈ గమ్యాన్ని చేరుకోవాలని యేసు క్రీస్తు ద్వారా నన్ను పరలోకం కొరకు పిలిచాడు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

14 క్రీస్తు యేసులో దేవుని ఉన్నత పిలుపు వలన కలిగే బహుమానాన్ని గెలవడానికి, లక్ష్యం వైపే పరుగెడుతున్నాను.

See the chapter Copy

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

14 క్రీస్తు యేసులో దేవుని ఉన్నత పిలుపు వలన కలిగే బహుమానాన్ని గెలవడానికి, లక్ష్యం వైపే పరుగెడుతున్నాను.

See the chapter Copy




ఫిలిప్పీయులకు 3:14
20 Cross References  

“బాప్తిస్మమిచ్చు యోహాను కాలం వరకు ధర్మశాస్త్రం మరియు ప్రవక్తలు ఉన్నారు. అప్పటి నుండి దేవుని రాజ్యసువార్త ప్రకటింపబడుతూ ఉంది, ప్రతి ఒక్కరు ఆ రాజ్యంలోనికి చొరబడుతూనే ఉన్నారు.


అయితే దేవుని కృపావరం ఆయన పిలుపు ఎన్నటికి మారనివి.


పరుగు పందెంలో పాల్గొనే వారందరు పరుగెడతారు కాని, ఒక్కరే బహుమానం పొందుకుంటారని మీకు తెలియదా? బహుమానాన్ని పొందుకొనేలా పరుగెత్తండి.


మేము అనుభవిస్తున్న ఈ క్షణికమైన తేలికైన కష్టాలు వాటికన్నా ఎంతో అధికమైన నిత్య మహిమను సంపాదిస్తున్నాయి.


ఎందుకంటే, మనం సున్నతి పొందినవారం, దేవుని ఆత్మ చేత ఆయనను ఆరాధిస్తాం, క్రీస్తు యేసులో అతిశయపడతాం, శరీరంపై నమ్మకం ఉంచండి.


అతివినయంలో ఆనందిస్తూ, దేవదూతలపట్ల భక్తి చూపే ఎవరైనా మిమ్మల్ని అనర్హులుగా చేయకుండా చూసుకోండి. అలాంటివారు తాము చూచిన వాటిని గురించి గొప్పగా వివరిస్తూ ఉంటారు; తమ బుద్ధిహీనమైన మనస్సు వలన వ్యర్థమైన ఆలోచనలతో అతిశయపడతారు.


మిమ్మల్ని తన రాజ్యంలోనికి, మహిమలోనికి పిలిచే దేవునికి తగినట్లుగా మీరు జీవించాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తూ, ఆదరిస్తూ వేడుకొంటున్నాను.


దేవుడు మనల్ని రక్షించి, పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి పిలిచిన పిలుపు, మనం చేసిన మంచి పనులను బట్టి కాదు గాని, ఆయన ప్రణాళిక మరియు కృపను బట్టియే. ఆ కృప సృష్టి ఆరంభానికి ముందే క్రీస్తు యేసు మూలంగా మనకు ఇవ్వబడింది,


కనుక, పరలోక పిలుపులో భాగస్థులైన పరిశుద్ధ సహోదరీ సహోదరులారా, మన అపొస్తలునిగా ప్రధాన యాజకునిగా మనం అంగీకరించిన యేసు మీద మీ ఆలోచనలను ఉంచండి.


అందువల్ల మనం క్రీస్తు గురించిన ప్రాధమిక బోధన అంటే, మరణానికి దారితీసే చర్యల నుండి పశ్చాత్తాపం, దేవుని యందు విశ్వాసముంచడం వంటి వాటితో మళ్ళీ పునాదిని మళ్ళీ వేయక, దానికి మించి, పరిపక్వతకు వైపుకు వెళ్దాం,


కాబట్టి, మెలకువ కలిగి నిబ్బరమైన బుద్ధిగల మనస్సులతో, యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడే కృప విషయమై సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండండి.


తన శాశ్వత మహిమలోనికి క్రీస్తులో మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియైన దేవుడు, మీరు కొంత కాలం బాధలు పొందిన తరువాత ఆయనే స్వయంగా మీకు స్థిరత్వాన్ని, బలాన్ని అనుగ్రహిస్తారు.


తన సొంత మహిమ వలన మంచితనం వలన మనల్ని పిలిచినవాని గురించి మనకున్న జ్ఞానం ద్వారా ఆయన యొక్క దైవశక్తి, దైవిక జీవితాన్ని జీవించడానికి మనకు కావలసిన ప్రతిదానిని మనకు ఇస్తుంది.


జయించినవారికి నేను జయించి, నా తండ్రితో పాటు ఆయన సింహాసనం మీద కూర్చున్నట్లే వానిని నా సింహాసనంలో నాతో పాటు కూర్చోనిస్తాను.


Follow us:

Advertisements


Advertisements