Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ఫిలిప్పీయులకు 2:8 - తెలుగు సమకాలీన అనువాదము

8 మనుష్యునిగా కనబడి మరణానికి విధేయత చూపించడం ద్వారా అనగా సిలువ మరణం పొందేంతగా తనను తాను తగ్గించుకున్నారు!

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

8 మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించు కొనెను.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 చావు దాకా, అంటే, సిలువ మీద చావుకైనా సరే, తనను తాను తగ్గించుకుని, లోబడ్డాడు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

8 మానవుని వలే కనిపిస్తూ, వినయంగా వుంటూ, మరణాన్ని కూడా విధేయతగా అంగీకరించి, సిలువపై మరణించాడు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

8 మనుష్యునిగా కనబడి మరణానికి విధేయత చూపించడం ద్వారా అనగా సిలువ మరణం పొందేంతగా తనను తాను తగ్గించుకున్నారు!

See the chapter Copy

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

8 మనుష్యునిగా కనబడి మరణానికి విధేయత చూపించడం ద్వారా అనగా సిలువ మరణం పొందేంతగా తనను తాను తగ్గించుకున్నారు!

See the chapter Copy




ఫిలిప్పీయులకు 2:8
26 Cross References  

అక్కడ ఆయన వారి ముందు రూపాంతరం పొందారు. అప్పుడు ఆయన ముఖం సూర్యునిలా ప్రకాశించింది, ఆయన వస్త్రాలు వెలుగువలె తెల్లగా మారాయి.


కొంత దూరం వెళ్లి, సాగిలపడి, “నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నెను నా దగ్గర నుండి తొలగిపోనివ్వు. అయినా నా చిత్తప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే జరిగించు” అని ప్రార్థించారు.


ఆయన రెండవ సారి వెళ్లి ప్రార్థించారు, “నా తండ్రీ, నేను దీనిని త్రాగితేనే తప్ప ఇది నా దగ్గరి నుండి తొలగిపోవడం సాధ్యం కానట్లైతే, నీ చిత్తమే నెరవేర్చు.”


ఆయన ప్రార్థిస్తున్నప్పుడు, ఆయన ముఖరూపం మారింది, ఆయన వస్త్రాలు తెల్లగా ధగధగా మెరుస్తున్నాయి.


నా దగ్గర నుండి ఎవరు దానిని తీసుకోలేరు, నా అంతట నేనే దాన్ని పెడుతున్నాను. ప్రాణం పెట్టడానికి దానిని తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. ఈ ఆజ్ఞను నేను నా తండ్రి నుండి పొందాను” అని చెప్పారు.


అయితే నేను తండ్రిని ప్రేమిస్తున్నానని, తండ్రి నాకు ఆజ్ఞాపించిన వాటిని మాత్రమే నేను చేస్తున్నానని ఈ లోకం తెలుసుకోవాలనే అతడు వస్తాడు. “లేవండి, ఇక్కడి నుండి వెళ్దాం” అన్నారు.


నేను నా తండ్రి ఆజ్ఞలను పాటిస్తూ ఆయన ప్రేమలో నిలిచి ఉన్నట్లే, మీరు నా ఆజ్ఞలను పాటిస్తే, నా ప్రేమలో నిలిచి ఉంటారు.


యేసు వారితో, “నన్ను పంపినవాని చిత్తప్రకారం చేసి ఆయన పనిని ముగించడమే నా ఆహారం.


తన దీనత్వాన్ని బట్టి ఆయన న్యాయాన్ని కోల్పోయాడు. ఆయన సంతానం గురించి మాట్లాడేవారు ఎవరు? ఎందుకంటే భూమి మీద నుండి ఆయన ప్రాణం తీసివేయబడింది.”


ఒక్క మానవుని అవిధేయత వలన అనేకమంది పాపులుగా చేయబడ్డారు, అలాగే ఒక్క మానవుని విధేయత వల్లనే అనేకమంది నీతిమంతులుగా చేయబడ్డారు.


మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప ఎలాంటిదో మీకు తెలుసు. ఆయన ధనవంతుడైనా తన పేదరికం ద్వారా మిమ్మల్ని ధనవంతులను చేయడానికి మీ కొరకు ఆయన పేదవానిగా అయ్యారు.


ధర్మశాస్త్రం వల్ల వచ్చే శాపం నుండి మనలను విమోచించడానికి క్రీస్తు మన కొరకు శాపగ్రస్తుడయ్యారు. ఎందుకంటే, లేఖనాల్లో వ్రాయబడిన ప్రకారం “మ్రానుపై వ్రేలాడదీయబడిన ప్రతీ ఒక్కరు శాపగ్రస్తులే.”


యేసు క్రీస్తు మన అతిక్రమాలన్నిటి నుండి మనల్ని విడిపించడానికి మంచి చేయడానికి ఆసక్తి కలిగిన తన ప్రజలుగా మనల్ని పవిత్రపరచాలని తనను తాను అర్పించుకున్నారు.


మన ముందు ఉన్న పరుగు పందెంలో ఓపికతో పరుగెడదాం. ఆయన తన యెదుట ఉంచబడిన ఆనందం కొరకు సిలువను భరించి దానివల్ల కలిగే అవమానాలను లక్ష్యపెట్టక, ఇప్పుడు దేవుని సింహాసనానికి కుడి వైపున కూర్చునివున్నారు.


మీరు పాపంతో పోరాడటంలో మీ రక్తం చిందేంతగా ప్రతిఘటించలేదు.


మనం పాపం కొరకు మరణించి నీతికొరకు జీవించేలా ఆయన “మన పాపాలను తనపై ఉంచుకొని సిలువను మోసారు. ఆయన పొందిన గాయాల వల్ల మీరు స్వస్థత పొందారు.


ఎందుకంటే, దేవుని దగ్గరకు తీసుకొనిరావడానికి, అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో బ్రతికించబడి, పాపాల విషయంలో ఒక్కసారే శ్రమపడ్డారు.


Follow us:

Advertisements


Advertisements