Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ఫిలిప్పీయులకు 2:7 - తెలుగు సమకాలీన అనువాదము

7 కాని దాసుని స్వరూపాన్ని ధరించుకొని తనను తాను ఏమీ లేనివానిగా చేసికొని మనుష్యుని పోలికగా పుట్టారు.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

7 మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

7 అయితే, దానికి ప్రతిగా తనను తాను ఖాళీ చేసుకున్నాడు. బానిస రూపం తీసుకున్నాడు. మానవుల పోలికలో కనిపించాడు. ఆకారంలో ఆయన మనిషిగా కనిపించాడు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

7 ఆయన అంతా వదులుకొన్నాడు. మానవ రూపం దాల్చి సేవకునివలే ఉండటానికి వచ్చాడు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

7 కాని దాసుని స్వరూపాన్ని ధరించుకొని తనను తాను ఏమీ లేనివానిగా చేసికొని మనుష్యుని పోలికగా పుట్టారు.

See the chapter Copy

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

7 కాని దాసుని స్వరూపాన్ని ధరించుకొని తనను తాను ఏమీ లేనివానిగా చేసికొని మనుష్యుని పోలికగా పుట్టారు.

See the chapter Copy




ఫిలిప్పీయులకు 2:7
31 Cross References  

“ఇదిగో, నేను ఏర్పరచుకున్న నా సేవకుడు, నేను ఆనందిస్తున్న నా ప్రియమైన సేవకుడు ఇతడే ఈయన మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఈయన దేశాలకు న్యాయాన్ని ప్రకటిస్తాడు.


ఎందుకనగా మనుష్యకుమారుడు సేవలు చేయించుకోడానికి రాలేదు గాని సేవ చేయడానికి, అనేకుల విమోచన కొరకు తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు” అని చెప్పారు.


అందుకు యేసు, “ఏలీయా ముందుగా వచ్చి అన్నిటినీ చక్కపెడతాడు అనే మాట నిజమే. అలాంటప్పుడు మనుష్యకుమారుడు అధికంగా హింసను అనుభవించి తృణీకరించబడతాడని ఎందుకు వ్రాయబడింది?


అసలు గొప్పవాడు ఎవరు, భోజనబల్ల దగ్గర ఉన్నవాడా, లేక సేవ చేసేవాడా? భోజనబల్ల దగ్గర ఉన్న వాడు కాదా? కానీ నేనైతే మీ మధ్య సేవ చేసేవానిలా ఉన్నాను.


ఆ వాక్యం శరీరాన్ని ధరించుకొని మన మధ్య నివసించింది. మనం ఆయన మహిమను చూశాము, కృపాసత్య సంపూర్ణుడై, తండ్రి దగ్గర నుండి వచ్చిన, ఏకైక కుమారుని మహిమను చూశాము.


ఆయన శరీరరీత్య దావీదు వంశస్థుడు,


క్రీస్తు కూడా తనను తానే సంతోషపరచుకోలేదు కాని, “నిన్ను అవమానపరిచేవారి అవమానాలు నాపై పడ్డాయి” అని లేఖననాల్లో వ్రాయబడిన ప్రకారం ఆయన వాటిని అనుభవించారు.


దేవుని సత్యం పక్షాన క్రీస్తు యూదుల సేవకుడిగా మారాడు, తద్వారా పితరులకు ఇచ్చిన వాగ్దానాలు ధృవీకరించబడతాయి,


శరీరాన్ని బట్టి ధర్మశాస్త్రం బలహీనమై దేన్ని చేయడానికి శక్తిహీనంగా ఉండిందో, దాన్ని చేయడానికి దేవుడు పాపపూరితమైన శరీర రూపంలో పాపపరిహారార్థ బలిగా ఉండడానికి తన సొంత కుమారున్ని పంపించారు. అప్పుడు ఆయన శరీరంలో ఉన్న పాపానికి శిక్ష విధించారు,


నిజానికి, బలహీనతలో ఆయన సిలువ వేయబడ్డాడు గాని, దేవుని శక్తిని బట్టి ఆయన జీవిస్తున్నాడు. అలాగే మేము ఆయనలో బలహీనులం, అయినా మేము మీతో వ్యవహరించే విషయంలో దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడ జీవిస్తున్నాం.


మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప ఎలాంటిదో మీకు తెలుసు. ఆయన ధనవంతుడైనా తన పేదరికం ద్వారా మిమ్మల్ని ధనవంతులను చేయడానికి మీ కొరకు ఆయన పేదవానిగా అయ్యారు.


అయితే నియమించబడిన కాలం పూర్తి అయినప్పుడు, దేవుడు తన కుమారున్ని, ధర్మశాస్త్ర ఆధీనంలో, ఒక స్త్రీ ద్వారా జన్మింపజేసారు,


ఆయన దేవుని స్వరూపాన్ని పూర్తిగా కలిగినవాడై యుండి, దేవునితో సమానంగా ఉండడాన్ని విడిచి పెట్టకూడని భాగ్యమని భావించలేదు;


మన ముందు ఉన్న పరుగు పందెంలో ఓపికతో పరుగెడదాం. ఆయన తన యెదుట ఉంచబడిన ఆనందం కొరకు సిలువను భరించి దానివల్ల కలిగే అవమానాలను లక్ష్యపెట్టక, ఇప్పుడు దేవుని సింహాసనానికి కుడి వైపున కూర్చునివున్నారు.


చెరసాలలో ఉన్న వారిని మీరు కూడా వారితో పాటు చెరసాలలో ఉన్నట్లుగా, బాధలుపడుతున్న వారితో మీరు కూడా ఆ బాధల్లో వారితో ఉన్నట్లుగా వారిని జ్ఞాపకం చేసుకోండి.


అయితే మన ప్రధాన యాజకుడు మనలానే అన్ని విధాలుగా శోధించబడినప్పటికి ఆయన పాపం చేయలేదు కనుక మన బలహీనతల గురించి సానుభూతి చూపించేవాడు.


Follow us:

Advertisements


Advertisements