Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ఫిలిప్పీయులకు 2:6 - తెలుగు సమకాలీన అనువాదము

6 ఆయన దేవుని స్వరూపాన్ని పూర్తిగా కలిగినవాడై యుండి, దేవునితో సమానంగా ఉండడాన్ని విడిచి పెట్టకూడని భాగ్యమని భావించలేదు;

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 ఆయన దేవుని స్వరూ పము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 ఆయన దేవుని స్వరూపం కలిగినవాడు. దేవునితో తన సమానత్వాన్ని విడిచిపెట్ట లేనిదిగా ఎంచుకోలేదు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

6 ఆయన దేవునితో సమానము. అయినా ఆయన ఆ స్థానాన్ని పట్టుకొని కూర్చోవాలనుకోలేదు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 ఆయన దేవుని స్వరూపాన్ని పూర్తిగా కలిగినవాడై ఉండి, దేవునితో సమానంగా ఉండడాన్ని విడిచి పెట్టకూడని భాగ్యమని భావించలేదు;

See the chapter Copy

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 ఆయన దేవుని స్వరూపాన్ని పూర్తిగా కలిగినవాడై ఉండి, దేవునితో సమానంగా ఉండడాన్ని విడిచి పెట్టకూడని భాగ్యమని భావించలేదు;

See the chapter Copy




ఫిలిప్పీయులకు 2:6
37 Cross References  

“ఒక కన్య గర్భం ధరించి ఒక కుమారునికి జన్మనిస్తుంది, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతారు” ఇమ్మానుయేలు అంటే “దేవుడు మనతో ఉన్నాడు” అని అర్థం.


ఎవ్వరూ ఎన్నడును దేవుని చూడలేదు, కానీ తానే దేవుడైయుండి, తండ్రితో అత్యంత సమీప సంబంధం కలిగియున్న, ఏకైక కుమారుడే ఆయనను మనకు తెలియపరిచారు.


నేను నా తండ్రి ఏకమై ఉన్నాం” అన్నారు.


“అందుకు యూదులు, నీవు చేసిన మంచిపనుల బట్టి కాదు, నీవు మానవుడవై యుండి దేవుడను అని చెప్పుకొంటూ దైవదూషణ చేస్తున్నందుకు” అని చెప్పారు.


అయితే నేను వాటిని చేస్తే, మీరు నన్ను నమ్మకపోయినా, తండ్రి నాలో, నేను తండ్రిలో ఉన్నామని మీరు తెలుసుకొని గ్రహించేలా, నేను చేసే క్రియలను నమ్మండి” అని చెప్పారు.


“ ‘నేను వెళ్లి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను’ అని నేను చెప్పిన మాటను మీరు విని ఉన్నారు. అయితే మీరు నన్ను ప్రేమిస్తే, నేను తండ్రి దగ్గరకు వెళ్తున్నానని సంతోషించేవారు, ఎందుకంటే తండ్రి నాకన్నా గొప్పవాడు.


యేసు అతనితో, “ఫిలిప్పూ, నేను ఇంతకాలం ఉన్నాక కూడా నేను నీకు తెలియదా? నన్ను చూసినవాడు తండ్రిని చూసాడు, కనుక ‘తండ్రిని చూపించు’ అని ఎలా అడుగుతున్నావు?


తండ్రీ, ఈ లోక ఆరంభానికి ముందు నీతో నాకు ఉండిన మహిమతో ఇప్పుడు నన్ను నీ సన్నిధిలో మహిమపరచు.


తోమా ఆయనతో, “నా ప్రభువా, నా దేవా!” అన్నాడు.


కనుక వారు, యేసు సబ్బాతు దినాన్ని పాటించకపోవడమే కాక దేవుణ్ణి తన సొంత తండ్రి అని పిలుస్తూ, తనను తాను దేవునితో సమానునిగా చేసుకుంటున్నాడని ఆయనను చంపడానికి మరింత గట్టిగా ప్రయత్నించారు.


ఆయన అందరికి తీర్పు తీర్చే అధికారాన్ని కుమారునికే ఇచ్చారు. కుమారుని ఘనపరచని వారు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచరు.


పితరులు వారి వారే, అందరికి దేవుడైన క్రీస్తు మానవ వంశావళి వారిలో నుండే గుర్తించబడింది. నిత్యం స్తుతింపబడునుగాక! ఆమేన్.


దేవుని స్వరూపియైన క్రీస్తు మహిమను కనుబరచే సువార్త వెలుగును వారు చూడకుండా ఈ యుగసంబంధమైన దేవత, అవిశ్వాసులైనవారి మనస్సుకు గ్రుడ్డితనం కలుగజేసింది.


మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప ఎలాంటిదో మీకు తెలుసు. ఆయన ధనవంతుడైనా తన పేదరికం ద్వారా మిమ్మల్ని ధనవంతులను చేయడానికి మీ కొరకు ఆయన పేదవానిగా అయ్యారు.


కనుక నిత్య రాజుగా వున్న, అమరుడగు అదృశ్యుడైన ఒకే దేవునికి ఘనత మహిమలు నిరంతరం కలుగును గాక. ఆమేన్.


నిస్సందేహంగా నిజమైన దైవభక్తిని గురించిన మర్మం గొప్పది, అది ఏంటంటే: ఆయన శరీరంతో ప్రత్యక్షమయ్యారు, పవిత్రాత్మ ఆయనను నీతిమంతుడని నిరూపించాడు, దేవదూతలు ఆయనను చూసారు, ఆయన గురించి భూరాజ్యాలన్నిటిలో ప్రజలు ప్రకటించారు, ఆయన గురించి లోకమంతా నమ్మింది, ఆయనను దేవుడు మహిమలోనికి తీసుకొనివెళ్ళారు.


స్వీయ నియంత్రణ కలిగి, ఈ ప్రస్తుత యుగంలో న్యాయంగా భక్తి కలిగి జీవించమని ఆ కృపయే మనకు బోధిస్తుంది.


ఆ కుమారుడు తన శక్తిగల మాటచేత సమస్తాన్ని సంరక్షిస్తూ, దేవుని మహిమ యొక్క ప్రకాశంగా, ఆయన ఉనికికి ఖచ్చితమైన ప్రాతినిధ్యంగా ఉన్నారు. పాపాలకు ఆయన శుద్ధీకరణను సిద్ధపరచిన తరువాత, ఆయన పరలోకంలో ఉన్న మహోన్నతుని కుడి వైపున కూర్చున్నారు.


దేవుడు తన మొదటి సంతానాన్ని భూలోకానికి తెచ్చినప్పుడు, ఆయన, “దేవదూతలందరు ఆయనను ఆరాధించాలి,” అని చెప్పారు.


కాని తన కుమారుని గురించి ఆయన, “ఓ దేవా, నీ సింహాసనం నిరంతరం నిలుస్తుంది; న్యాయమనేది నీ రాజ్యానికి రాజదండం.


యేసు క్రీస్తు నిన్న, నేడు, నిరంతరం ఒకే విధంగా ఉన్నాడు.


ఆయన నాతో, “సమాప్తమైనది. ఆల్ఫా, ఒమేగాను నేనే, ఆది అంతం నేనే. దప్పికతో ఉన్నవారికి జీవజల ఊట నుండి నీరు ఉచితంగా ఇస్తాను.


Follow us:

Advertisements


Advertisements