Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ఫిలిప్పీయులకు 1:7 - తెలుగు సమకాలీన అనువాదము

7 నేను సంకెళ్ళలో ఉన్నా లేదా సువార్త గురించి వాదించడంలో దానిని స్ధిరపరచడంలో మీరందరు నాతో కూడా ఈ కృపలో భాగస్థులుగా ఉన్నారు, కనుక మీరు నా హృదయంలో ఉన్నారు. అందువల్ల మీ అందరి గురించి ఇలా భావించడం నాకు న్యాయమే.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

7 నా బంధకములయందును, నేను సువార్తపక్షమున వాదించుటయందును, దానిని స్థిరపరచుటయందును, మీరందరు ఈ కృపలో నాతోకూడ పాలివారై యున్నారు గనుక నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని యున్నాను. ఇందుచేత మిమ్మునందరినిగూర్చి యీలాగు భావించుట నాకు ధర్మమే.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

7 మిమ్మల్ని గురించి నేనిలా భావించడం సబబే. ఎందుకంటే మీరు నా హృదయంలో ఉన్నారు. నేను ఖైదులో ఉన్నప్పుడూ, నేను సువార్త పక్షంగా వాదిస్తూ నిరూపిస్తున్నపుడు మీరంతా ఈ కృపలో నాతో పాలివారుగా ఉన్నారు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

7 మీరు నా హృదయంలో ఉన్నారు. కనుక మీ అందర్ని గురించి నేనీవిధంగా ఆలోచించటం సమంజసమే. ఎందుకంటే నేను సంకెళ్ళలో ఉన్నా, లేక సువార్తను ప్రకటిస్తూ దానిలో ఉన్న నిజాన్ని నిరూపిస్తూ, స్వేచ్ఛగా పర్యటన చేస్తున్నా దైవానుగ్రహాన్ని మీరు నాతో కలిసి పంచుకొన్నారు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

7 నేను సంకెళ్ళలో ఉన్నా లేదా సువార్త గురించి వాదించడంలో దానిని స్ధిరపరచడంలో మీరందరు నాతో కూడా ఈ కృపలో భాగస్థులుగా ఉన్నారు, కాబట్టి మీరు నా హృదయంలో ఉన్నారు. అందువల్ల మీ అందరి గురించి ఇలా భావించడం నాకు న్యాయమే.

See the chapter Copy

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

7 నేను సంకెళ్ళలో ఉన్నా లేదా సువార్త గురించి వాదించడంలో దానిని స్ధిరపరచడంలో మీరందరు నాతో కూడా ఈ కృపలో భాగస్థులుగా ఉన్నారు, కాబట్టి మీరు నా హృదయంలో ఉన్నారు. అందువల్ల మీ అందరి గురించి ఇలా భావించడం నాకు న్యాయమే.

See the chapter Copy




ఫిలిప్పీయులకు 1:7
34 Cross References  

ప్రతి పట్టణంలో నా కొరకు సంకెళ్ళు మరియు హింసలు వేచి ఉన్నాయని, పరిశుద్ధాత్మ నన్ను హెచ్చరిస్తున్నాడని మాత్రం నాకు తెలుసు.


అధిపతి వచ్చి అతన్ని పట్టుకొని, రెండు గొలుసులతో బంధించమని ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత “అతడు ఎవరు? ఏమి చేశాడు?” అని అడిగాడు.


అది ఎల్లప్పుడు కాపాడుతుంది, ఎల్లప్పుడు నమ్ముతుంది, ఎల్లప్పుడు నిరీక్షిస్తుంది, ఎల్లప్పుడు సహిస్తుంది.


సువార్త వల్ల కలిగే ఆశీర్వాదాలలో నేను భాగస్థునిగా ఉండాలని నేను సువార్త కోసమే వీటన్నిటినీ చేశాను.


మా హృదయాల మీద వ్రాయబడి, మనుష్యులందరు తెలుసుకోవాల్సిన చదవాల్సిన మా పత్రిక మీరే.


మిమ్మల్ని గద్దించాలనే ఉద్దేశంతో నేను ఇలా చెప్పడం లేదు; ఎందుకంటే, జీవించినా మరణించినా మేము మీతో ఉండేలా మా హృదయాల్లో మీకు ప్రత్యేక స్థానం ఉందని నేను ముందే చెప్పాను.


యేసుక్రీస్తులో ఉన్నవారు సున్నతి పొందినా పొందకపోయినా దానివల్ల ప్రయోజనమేమి ఉండదు. కేవలం ప్రేమ ద్వారా వ్యక్తపరచబడే విశ్వాసం మాత్రమే లెక్కించబడుతుంది.


ఈ కారణంచేత, యూదులు కాని మీరు రక్షింపబడాలని, పౌలు అనే నేను క్రీస్తు యేసు సువార్త విషయంలో ఖైదీనై యున్నాను.


మీరు పిలువబడిన పిలుపుకు యోగ్యులుగా నడుచుకోవాలని క్రీస్తు ఖైదీనైన నేను మిమ్మల్ని కోరుతున్నాను.


దాని కొరకే నేను రాయబారినై సంకెళ్ళలో ఉన్నాను, నేను దాన్ని ఎలా ప్రకటించాలో అలా దానిని ధైర్యంగా ప్రకటించేలా ప్రార్థించండి.


సహోదరీ సహోదరులారా, నాకు కలిగిన శ్రమల కారణంగా సువార్త మరి ఎక్కువగా విస్తరించిందని మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను.


దాని ఫలితంగా, క్రీస్తు కొరకు నేను సంకెళ్ళలో ఉన్నానని, రాజమందిరాన్ని కాపలాకాసే వారందరికి, ప్రతి ఒక్కరికి స్పష్టంగా తెలిసింది.


నా సంకెళ్ళ మూలంగా సహోదరీ సహోదరులలో చాలామంది ప్రభువులో స్ధిరమైన విశ్వాసం కలిగి, నిర్భయంగా దేవుని వాక్యాన్ని బోధించడానికి మరి ఎక్కువ ధైర్యం తెచ్చుకున్నారు.


మొదటి నుండి ఇప్పటి వరకు సువార్త విషయంలో మీరు నాతో జతపని వారిగా ఉండడం చూసి,


తిమోతి యోగ్యుడని మీకు తెలుసు, ఎందుకంటే ఒక కుమారుడు తన తండ్రికి సేవ చేసినట్లుగా సువార్త పనిలో అతడు నాతో కలిసి సేవ చేశాడు.


అయినప్పటికి మీరు నా శ్రమలలో భాగం పంచుకోవడం మంచి పని.


అంతేకాక, ఫిలిప్పీయులారా, మీరు సువార్తను తెలుసుకున్న తొలి రోజులలో, నేను మాసిదోనియలో నుండి పంపబడినప్పుడు, ఇవ్వడంలో తీసుకోవడంలో కేవలం మీరు తప్ప మరి ఏ సంఘం నాతో భాగస్థులు కాలేదని మీకు తెలుసు.


అవును, నా నిజమైన సహకారి, ఈ స్త్రీలు క్లెమెంతుతో, మిగతా నా సహపనివారితో కలిసి సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడ్డారు. కనుక వారికి సహాయం చేయమని నిన్ను అడుగుతున్నా. వారి పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడివున్నాయి.


పౌలు అను నేను నా స్వహస్తంతో ఈ శుభములు వ్రాస్తున్నాను. నా సంకెళ్ళను జ్ఞాపకముంచుకోండి. కృప మీతో ఉండును గాక.


నేను సంకెళ్ళతో ఉండడానికి కారణమైన క్రీస్తు మర్మాన్ని మేము ప్రకటించడానికి, మా సువార్త పరిచర్యకు దేవుడు ద్వారాలను తెరవాలని మా కొరకు కూడా ప్రార్థన చేయండి.


మీరంతా వెలుగు సంతానం పగటి సంతానం. మనం చీకటికి లేదా రాత్రికి చెందినవారం కాదు.


కనుక నీవు మన ప్రభువు కొరకు సాక్ష్యమివ్వడానికి గాని ఆయన కొరకు బంధీనై ఉన్న నా గురించి కాని సిగ్గుపడకు. దానికి బదులు దేవుని శక్తిని బట్టి సువార్త కొరకు నాతో పాటు కలిసి శ్రమలను అనుభవించడానికి సిద్ధపడు.


దీనిని బట్టే నేను నేరస్థునిలా బంధించబడ్డాను. కాని దేవుని వాక్యం బంధించబడలేదు.


నేను సువార్త కొరకు సంకెళ్ళతో బంధింపబడి ఉన్న సమయంలో నాకు సహాయం చేయడానికి నీ బదులుగా అతన్ని నాతో పాటు ఉంచుకొని ఉండేవాడిని.


కనుక, పరలోక పిలుపులో భాగస్థులైన పరిశుద్ధ సహోదరీ సహోదరులారా, మన అపొస్తలునిగా ప్రధాన యాజకునిగా మనం అంగీకరించిన యేసు మీద మీ ఆలోచనలను ఉంచండి.


పైగా క్రీస్తు బాధలలో పాలుపొందామని ఆనందించండి, దానివల్ల ఆయన మహిమ ప్రదర్శింపబడిన దినాన మీరు మహానందాన్ని అనుభవిస్తారు.


తోటి సంఘపెద్దగా, క్రీస్తు పడిన శ్రమలకు సాక్షినై ఉండి, ప్రత్యక్షపరచబడబోయే మహిమలో భాగం పంచుకోబోతున్న నేను మీ సంఘ పెద్దలకు విజ్ఞప్తి చేసేది ఏమంటే:


నేను ఈ శరీరమనే గుడారంలో జీవించినంత కాలం, ఈ సంగతులను గురించి మీకు జ్ఞాపకం చేయడం మంచిదని తలంచాను.


మనం ఒకరిని ఒకరం ప్రేమిస్తున్నాము, కనుక మరణంలో నుండి జీవంలోనికి దాటామని మనకు తెలుసు. ప్రేమ లేనివారు మరణంలో నిలిచివుంటారు.


Follow us:

Advertisements


Advertisements