Online Bible

- Advertisements -




జెకర్యా 14:20 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

20 ఆ రోజున గుర్రాలకు కట్టిన గంటల మీద, “యెహోవాకు పవిత్రమైనది” అని వ్రాయబడి ఉంటుంది. యెహోవా మందిరంలో ఉన్న వంట పాత్రలు బలిపీఠం ఎదుట ఉన్న పవిత్ర పాత్రల వలె ఉంటాయి.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

20 ఆ దినమున గుఱ్ఱములయొక్క కళ్లెములమీద–యెహోవాకు ప్రతిష్ఠితము అను మాట వ్రాయబడును; యెహోవా మందిరములోనున్న పాత్రలు బలిపీఠము ఎదుటనున్న పళ్లెములవలె ప్రతిష్ఠితములుగా ఎంచబడును.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

20 ఆ కాలంలో గుర్రాల కళ్ళాల పైన “యెహోవాకు ప్రతిష్టితం” అని రాసి ఉంటుంది. యెహోవా మందిరంలో ఉన్న వంటపాత్రలను బలిపీఠం ఎదుట ఉన్న గిన్నెల వలె పవిత్రంగా ఎంచుతారు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

20 ఆ సమయంలో ప్రతిదీ దేవునికి చెందివుంటుంది. గుర్రాలమీది జీనులకు కూడ “యెహోవాకు పవిత్రమైనది” అని వ్రాసిన చీటీలు కట్టబడతాయి. బలిపీఠంవద్ద వుంచబడిన గిన్నెలవలె యెహోవా ఆలయంలో వాడబడే పాత్రలన్నీ ప్రాముఖ్యంగల వస్తువులే.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

20 ఆ రోజున గుర్రాలకు కట్టిన గంటల మీద, “యెహోవాకు పవిత్రమైనది” అని వ్రాయబడి ఉంటుంది. యెహోవా మందిరంలో ఉన్న వంట పాత్రలు బలిపీఠం ఎదుట ఉన్న పవిత్ర పాత్రల వలె ఉంటాయి.

See the chapter Copy




జెకర్యా 14:20

Follow us:

Advertisements


Advertisements