Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ఫిలిప్పీయులకు 1:21 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

21 నాకైతే జీవించడం క్రీస్తు కొరకే, మరణమైతే లాభము.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

21 నామట్టుకైతే బ్రదుకుట క్రీస్తే, చావైతే లాభము.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

21 నావరకైతే బతకడం క్రీస్తే, మరి చావడం లాభమే.

See the chapter Copy

పవిత్ర బైబిల్

21 ఎందుకంటే, నాకు క్రీస్తే జీవితం. నేను మరణిస్తే, అది కూడా లాభకరమే.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

21 నాకైతే జీవించడం క్రీస్తు కొరకే, మరణమైతే లాభము.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదము

21 నాకైతే జీవించడం క్రీస్తు కొరకే, మరణమైతే లాభం.

See the chapter Copy




ఫిలిప్పీయులకు 1:21
16 Cross References  

దేవుడు చేసిన కార్యాలను బట్టి మీరు క్రీస్తు యేసులో ఉన్నారు. ఇప్పుడు క్రీస్తే దేవుని ద్వారా మనకు జ్ఞానంగా ఉన్నారు అనగా ఆయనే మన నీతిగా, పరిశుద్ధతగా, విమోచనగా ఉన్నారు.


పౌలు అయినా, అపొల్లో అయినా, కేఫా అయినా, లోకమైనా, జీవమైనా, మరణమైనా, ఇప్పుడు ఉన్న వాటిలోనైనా, రాబోయే వాటిలోనైనా అన్ని మీకు చెందినవే.


మనం నివసిస్తున్న భూసంబంధమైన గుడారం నాశనమైనా, మానవ నిర్మితం కాని దేవుడు కట్టిన ఒక శాశ్వతమైన గృహం పరలోకంలో ఉందని మనకు తెలుసు.


కాబట్టి మనం ఎల్లప్పుడు ఆత్మవిశ్వాసంతో ఉన్నాం, ఈ దేహంలో నివసించేంత కాలం ప్రభువుకు దూరంగా ఉన్నామని మనకు తెలుసు.


కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మనం సంపూర్ణ నమ్మకం కలిగి ఈ శరీరాన్ని విడిచిపెట్టి ప్రభువు దగ్గర నివసించాలని ఎంతగానో ఇష్టపడుతున్నాము.


నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ఇప్పుడు జీవిస్తుంది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నారు. ఇప్పుడు నేను శరీరంలో జీవిస్తున్న జీవితం, నన్ను ప్రేమించి నా కోసం తనను తాను అర్పించుకొన్న దేవుని కుమారునియందు విశ్వాసముంచడం వల్ల జీవిస్తున్నాను.


మన ప్రభువైన యేసు క్రీస్తు సిలువలో తప్ప మరి దేనిలో నేను అతిశయపడను. ఆ సిలువ ద్వారానే నాకు లోకం, లోకానికి నేను సిలువ వేయబడి ఉన్నాము.


నేను ఏ విషయంలోను సిగ్గుపడకుండా ఎప్పటిలాగానే ఇప్పుడు కూడా పూర్ణధైర్యంతో బోధించడం వలన నేను జీవించినా లేదా మరణించినా సరే, నా శరీరంలో ఎప్పుడూ క్రీస్తు ఘనపరచబడాలని నేను ఆసక్తితో ఆశించి నిరీక్షిస్తున్నాను.


ఒకవేళ నేను శరీరంలోనే జీవించాల్సి ఉంటే, ఇది నాకు ఫలభరితమైన ప్రయాసం అవుతుంది. అయినా నేను ఏమి కోరుకోవాలి? నాకు తెలియదు!


ఈ రెండింటికీ మధ్య నేను నలిగిపోతున్నాను. నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి క్రీస్తుతో కూడా ఉండాలని నా ఆశ, అది నాకు చాలా మంచిది.


ప్రతి ఒక్కరు తమ సొంత పనులపైనే ఆసక్తి చూపిస్తున్నారు, కాని యేసు క్రీస్తు పనులపై కాదు.


మీ జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, మీరు కూడా ఆయనతో పాటు మహిమలో ప్రత్యక్షమవుతారు.


అప్పుడు పరలోకం నుండి ఒక స్వరం, “ఇప్పటినుండి ప్రభువులో ఉంటూ చనిపోయే వారు ధన్యులు! అని వ్రాసి పెట్టు” అని చెప్పింది. దేవుని ఆత్మ, “అవును నిజమే, తమ ప్రయాస నుండి విశ్రాంతి పొందుతారు. ఎందుకంటే వారి క్రియల ఫలాన్ని వారు పొందుతారు” అని పలకడం వినిపించింది.


Follow us:

Advertisements


Advertisements