Online Bible

- Advertisements -




నెహెమ్యా 7:3 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 నేను వారితో, “బాగా ప్రొద్దెక్కే వరకు యెరూషలేము గుమ్మాల తలుపులు తీయకూడదు. ప్రజలు దగ్గర నిలబడి ఉన్నప్పుడు ద్వారపాలకులు తలుపులు మూసి అడ్డగడియలు పెట్టాలి. అలాగే యెరూషలేములో నివసించేవారు వారంతా తమ తమ ఇళ్ళకు ఎదురుగా కాపలా కాసేలా నియమించాలి” అని చెప్పాను.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 అప్పుడు నేను–బాగుగా ప్రొద్దెక్కువరకు యెరూషలేముయొక్క గుమ్మముల తలుపులు తియ్యకూడదు; మరియు జనులు దగ్గర నిలువబడియుండగా తలుపులు వేసి అడ్డగడియలు వాటికి వేయవలెననియు, ఇదియుగాక యెరూషలేము కాపురస్థులందరు తమతమ కావలి వంతులనుబట్టి తమ యిండ్లకు ఎదురుగా కాచుకొనుటకు కావలి నియమింపవలెననియు చెప్పితిని.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 అప్పుడు నేను “బాగా పొద్దెక్కే దాకా యెరూషలేం ద్వారాలు తెరవ వద్దు. ప్రజలంతా దగ్గరగా నిలబడి ఉన్నప్పుడు ద్వారపాలకులు తలుపులు మూసి వాటికి అడ్డగడియలు పెట్టాలి. అంతేకాక, యెరూషలేంలో నివాసముండే వారంతా తమ వంతుల ప్రకారం తమ ఇళ్ళకు ఎదురు కాపలా కాసేలా నియమించుకోవాలి” అని చెప్పాను.

See the chapter Copy

పవిత్ర బైబిల్

3 అప్పుడు నేను హనానీనీ, హనన్యానీ ఇలా ఆదేశించాను: “కొన్ని గంటలు పొద్దెక్కిన తర్వాత మాత్రమే మీరు యెరూషలేము ద్వారాలు తెరవాలి. పొద్దుగుంకేలోగానే మీరు తలుపులు మూసి, తాళాలు బిగించాలి. అంతేకాదు, కాపలా పనికి మనుష్యుల్ని యెరూషలేము నుంచి ఎంపిక చెయ్యండి. వాళ్లలో కొంతమందిని నగర రక్షణకుగాను ప్రత్యేక స్థానాల్లో నిలపండి. మిగిలిన వాళ్లని వాళ్ల వాళ్ల ఇళ్ల దగ్గరే పెట్టండి.”

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 నేను వారితో, “బాగా ప్రొద్దెక్కే వరకు యెరూషలేము గుమ్మాల తలుపులు తీయకూడదు. ప్రజలు దగ్గర నిలబడి ఉన్నప్పుడు ద్వారపాలకులు తలుపులు మూసి అడ్డగడియలు పెట్టాలి. అలాగే యెరూషలేములో నివసించేవారు వారంతా తమ తమ ఇళ్ళకు ఎదురుగా కాపలా కాసేలా నియమించాలి” అని చెప్పాను.

See the chapter Copy




నెహెమ్యా 7:3

Follow us:

Advertisements


Advertisements