Online Bible

- Advertisements -




యిర్మీయా 51:58 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

58 సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “బబులోను దృఢమైన గోడ నేలమట్టం అవుతుంది, దాని ఎత్తైన ద్వారాలకు నిప్పు పెట్టబడుతుంది. ప్రజలు వృధాగా కష్టపడుతున్నారు, దేశాల శ్రమ అగ్ని పాలవుతుంది.”

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

58 సైన్యములకధిపతియగు యెహోవా ఈ మాట సెల విచ్చుచున్నాడు విశాలమైన బబులోను ప్రాకారములు బొత్తిగా పడ గొట్టబడును దాని ఉన్నతమైన గుమ్మములు అగ్నిచేత కాల్చివేయ బడును –జనములు వృథాగా ప్రయాసపడుచున్నారు అగ్నిలో పడుటకై ప్రయాసపడుచున్నారు ప్రజలు చూచి అలయుచున్నారు.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

58 సేనల ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. “బబులోను భారీ ప్రాకారాలను సంపూర్ణంగా కూల్చి వేస్తారు. దాని ఎత్తయిన ద్వారాలను అగ్నితో కాల్చివేస్తారు. ఆమెకు సహాయం చేయడానికి వచ్చే వాళ్ళ ప్రయాస వృథాయే. ఆమె కోసం జనాలు చేసే ప్రయత్నాలన్నీ అగ్నికి ఆహుతి అవుతాయి.”

See the chapter Copy

పవిత్ర బైబిల్

58 సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు, “బబులోను యొక్క మందమైన, బలమైన గోడ కూలగొట్టబడుతుంది. దాని ఉన్నత ద్వారాలు తగులబెట్టబడతాయి. బబులోను ప్రజలు కష్టపడి పనిచేస్తారు. కాని అది వారికి సహాయపడదు! నగరాన్ని రక్షించటంలో వారు మిక్కిలి అలసిపోతారు. కాని వారు ఎగసేమంటల్లో కేవలం సమిధలవుతారు!”

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

58 సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “బబులోను దృఢమైన గోడ నేలమట్టం అవుతుంది, దాని ఎత్తైన ద్వారాలకు నిప్పు పెట్టబడుతుంది. ప్రజలు వృధాగా కష్టపడుతున్నారు, దేశాల శ్రమ అగ్ని పాలవుతుంది.”

See the chapter Copy




యిర్మీయా 51:58

Follow us:

Advertisements


Advertisements