Online Bible

- Advertisements -




యిర్మీయా 34:18 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

18 నా ఒడంబడికను ఉల్లంఘించి, నా ముందే తాము చేసిన ఒడంబడికలోని నిబంధనలను నెరవేర్చని వారిని, దూడను రెండు ముక్కలు చేసి దాని మధ్య నడిచినవారిగా నేను చూస్తాను.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

18-19 మరియు నా సన్నిధిని తాము చేసిన నిబంధన మాటలు నెరవేర్చక దాని నతిక్రమించువారిని, తాము రెండు భాగములుగా కోసి వాటిమధ్య నడిచిన దూడతో సమానులుగా చేయుచున్నాను; అనగా యూదా అధిపతులను యెరూషలేము అధిపతులను రాజ పరివారములోని వారిని యాజకులను దేశజనులనందరిని ఆ దూడయొక్క రెండు భాగములమధ్య నడచినవారినందరిని ఆ దూడతో సమానులుగా చేయుచున్నాను.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

18 నా సన్నిధిలో తాము చేసిన ఒప్పందపు మాటలు నెరవేర్చకుండా దాన్ని అతిక్రమించిన వాళ్ళ విషయం పట్టించుకుంటాను. వాళ్ళు ఒక దున్నపోతును రెండు భాగాలుగా కోసి వాటి మధ్య నడిచేవాళ్ళు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

18 నా ఒడంబడికను ఉల్లంఘించిన వారిని, నా ముందు తాము చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేని వారిని నేను శత్రువుకు అప్పగిస్తాను. ఈ మనుష్యులంతా నా ముందు తాము కోడె దూడను రెండు ముక్కలుగా నరికి, అ ముక్కల మధ్య నుండి నడచిన వారే.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

18 నా ఒడంబడికను ఉల్లంఘించి, నా ముందే తాము చేసిన ఒడంబడికలోని నిబంధనలను నెరవేర్చని వారిని, దూడను రెండు ముక్కలు చేసి దాని మధ్య నడిచినవారిగా నేను చూస్తాను.

See the chapter Copy




యిర్మీయా 34:18

Follow us:

Advertisements


Advertisements