Online Bible

- Advertisements -




యిర్మీయా 30:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 ఓ విషయం వారిని అడిగి చూడండి: పురుషుడు పిల్లలు కనగలడా? అలాంటప్పుడు ప్రసవ వేదనలో ఉన్న స్త్రీలా పురుషులందరు ఎందుకు నడుముపై చేతులు పెట్టుకున్నారు? వారి ముఖాలు ఎందుకు వాడిపోయాయి?

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 మీరు విచారించి తెలిసికొనుడి; పురుషులు ప్రసూతి వేదనతో పిల్లలను కందురా? ప్రసవవేదనపడు స్త్రీలవలె పురుషులందరును నడుముమీద చేతులుంచుకొనుటయు, వారి ముఖములు తెల్లబారుటయు నాకు కనబడుచున్నదేమి?

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 ప్రసూతి వేదనతో ఒక పురుషుడు బిడ్డను కనగలడా? మీరు అడిగి తెలుసుకోండి. ప్రతి యువకుడు తన నడుము మీద చేతులెందుకు పెట్టుకుంటున్నాడు? ప్రసవ వేదన పడే స్త్రీలా వాళ్ళ ముఖాలు ఎందుకు పాలిపోయాయి?

See the chapter Copy

పవిత్ర బైబిల్

6 “ఈ ప్రశ్న అడిగి, దాన్ని గురించి ఆలోచించుము: ఎవడైనా ఒక పురుషుడు బిడ్డను కనగలడా? అసంభవం! అయితే ప్రతి బలవంతుడు పురిటి నొప్పులతో బాధపడే స్త్రీ వలే తన కడుపు పట్టుకొనటం నేనెందుకు చూస్తున్నాను? ఎందువల్ల ప్రతివాని ముఖం శవంలా తెల్లనై వెలవెలబోతుంది? ఎందుకంటే పురుషులు మిక్కిలి భయపడి ఉన్నారు!

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 ఓ విషయం వారిని అడిగి చూడండి: పురుషుడు పిల్లలు కనగలడా? అలాంటప్పుడు ప్రసవ వేదనలో ఉన్న స్త్రీలా పురుషులందరు ఎందుకు నడుముపై చేతులు పెట్టుకున్నారు? వారి ముఖాలు ఎందుకు వాడిపోయాయి?

See the chapter Copy




యిర్మీయా 30:6

Follow us:

Advertisements


Advertisements