యిర్మీయా 25:29 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం29 ఇదిగో, నా పేరు ఉన్న పట్టణం మీదికి నేను విపత్తు రప్పించబోతున్నాను, మీరు నిజంగా శిక్షించబడరా? మీరు శిక్షించబడకుండా ఉండరు, ఎందుకంటే నేను భూమిపై నివసించే వారందరిపై ఖడ్గాన్ని రప్పిస్తున్నాను, అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు.’ See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)29 నా పేరు పెట్టబడిన పట్టణమునకు నేను కీడుచేయ మొదలుపెట్టగా మీకు శిక్షలేకుండ పోవునా? మీరు శిక్షింపబడకపోరు. భూలోక నివాసులందరిమీదికి నేను ఖడ్గమును రప్పించుచున్నాను; ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201929 నా పేరున్న పట్టణానికి నేను విపత్తు రప్పించబోతున్నాను. మీకు శిక్ష లేకుండా పోతుందా? మీరు తప్పించుకోలేరు. భూమి మీద ఉంటున్న వారందరి మీదికి నేను కత్తిని రప్పిస్తున్నాను. ఇది సేనల ప్రభువు యెహోవా వాక్కు. See the chapterపవిత్ర బైబిల్29 నా పేరుతో పిలవబడే యోరూషలేము నగరానికి ముప్పు తేవటం మొదలు పెట్టాను. బహుశః మీరు శిక్షింపబడక పోవచ్చునని మీరనుకుంటూ ఉండవచ్చు. అయితే మీరు పొరబడుతున్నారు. మీరు శిక్షింపబడతారు. భూమి మీదనున్న ప్రజలందరినీ ఎదుర్కోవటానికి నేను కత్తిని పంపుతున్నాను.’” ఇదే యెహోవా వాక్కు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం29 ఇదిగో, నా పేరు ఉన్న పట్టణం మీదికి నేను విపత్తు రప్పించబోతున్నాను, మీరు నిజంగా శిక్షించబడరా? మీరు శిక్షించబడకుండా ఉండరు, ఎందుకంటే నేను భూమిపై నివసించే వారందరిపై ఖడ్గాన్ని రప్పిస్తున్నాను, అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు.’ See the chapter |