Online Bible

- Advertisements -




ఆదికాండము 26:22 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

22 అతడు అక్కడినుండి వెళ్లి మరో బావి త్రవ్వించాడు, దాని కోసం ఎలాంటి గొడవ జరగలేదు. అతడు, “ఇప్పుడు యెహోవా మాకు స్థలం ఇచ్చారు, మేము ఈ దేశంలో వర్ధిల్లుతాము” అని ఆ బావికి రహెబోతు అని పేరు పెట్టాడు.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

22 అతడు అక్కడనుండి వెళ్లి మరియొక బావి త్రవ్వించెను. దాని విషయమై వారు జగడ మాడలేదు గనుక అతడు–ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగజేసియున్నాడు గనుక యీ దేశమందు అభివృద్ధి పొందుదుమనుకొని దానికి రహెబోతు అను పేరు పెట్టెను.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

22 అతడు అక్కడ్నించి వెళ్ళిపోయి మరో బావి తవ్వించాడు. దానికోసం ఎలాంటి గొడవా జరగలేదు. కాబట్టి ఇస్సాకు “యెహోవా మనకు ఒక తావు అనుగ్రహించాడు. కాబట్టి ఇక ఈ దేశంలో మనం అభివృద్ధి చెందుతాం” అంటూ ఆ స్థలానికి రహబోతు అనే పేరు పెట్టాడు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

22 ఇస్సాకు అక్కడనుండి వెళ్లిపోయి మరో బావి తవ్వాడు. ఆ బావి విషయం వాదించటానికి ఎవరూ రాలేదు. కనుక ఆ బావికి “రహెబోతు” అని ఇస్సాకు పేరు పెట్టాడు. “ఇప్పుడు మనకోసం యెహోవా ఒక స్థలం ఇచ్చాడు. ఈ దేశంలో మనం అభివృద్ధిపొంది సఫలము కావాలి.” అన్నాడు ఇస్సాకు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

22 అతడు అక్కడినుండి వెళ్లి మరో బావి త్రవ్వించాడు, దాని కోసం ఎలాంటి గొడవ జరగలేదు. అతడు, “ఇప్పుడు యెహోవా మాకు స్థలం ఇచ్చారు, మేము ఈ దేశంలో వర్ధిల్లుతాము” అని ఆ బావికి రహెబోతు అని పేరు పెట్టాడు.

See the chapter Copy




ఆదికాండము 26:22

Follow us:

Advertisements


Advertisements