ఆదికాండము 24:35 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం35 యెహోవా నా యజమానిని ఎంతో దీవించారు కాబట్టి అతడు చాలా ధనికుడయ్యాడు. అతనికి గొర్రెలను, మందలను, వెండి బంగారాలను, దాసదాసీలను, ఒంటెలను, గాడిదలను ఆయన ఇచ్చారు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201935 యెహోవా నా యజమానిని ఎంతో ఆశీర్వదించాడు. అతడు చాలా గొప్పవాడయ్యాడు. ఆయన అతనికి ఎన్నో గొర్రెలనూ, పశువులనూ, వెండీ బంగారాలనూ, దాసులనీ, దాసీలనూ అనుగ్రహించాడు. See the chapterపవిత్ర బైబిల్35 అన్ని విషయాల్లోను యెహోవా నా యజమానిని ఎంతో గొప్పగా ఆశీర్వదించాడు. నా యజమాని మహా ఘనుడయ్యాడు. గొర్రెల మందలు, పశువుల మందలు విస్తారంగా యెహోవా అబ్రాహాముకు ఇచ్చాడు. అబ్రాహాముకు వెండి బంగారాలు విస్తారంగా ఉన్నాయి. చాలా మంది ఆడ, మగ సేవకులు ఉన్నారు. ఒంటెలు, గాడిదలు చాలా ఉన్నాయి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం35 యెహోవా నా యజమానిని ఎంతో దీవించారు కాబట్టి అతడు చాలా ధనికుడయ్యాడు. అతనికి గొర్రెలను, మందలను, వెండి బంగారాలను, దాసదాసీలను, ఒంటెలను, గాడిదలను ఆయన ఇచ్చారు. See the chapter |