Online Bible

- Advertisements -




ఆదికాండము 18:19 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

19 ఎందుకంటే నేను అతన్ని ఎంచుకున్నాను, అతడు తన పిల్లలను తన తర్వాత తన ఇంటివారిని యెహోవా మార్గంలో నీతి న్యాయాలు జరిగిస్తూ జీవించేలా నడిపిస్తాడు, తద్వారా యెహోవా అబ్రాహాముకు చేసిన వాగ్దానాన్ని జరిగిస్తారు.”

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

19 ఎట్లనగా యెహోవా అబ్రాహామునుగూర్చి చెప్పినది అతనికి కలుగ జేయునట్లు తన తరువాత తన పిల్లలును తన యింటివారును నీతి న్యాయములు జరిగించుచు, యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికాజ్ఞాపించినట్లు నేనతని నెరిగియున్నాననెను.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

19 అతని తరువాత అతని వారసులు నీతి న్యాయాలను జరిగించేలా వారికి యెహోవా మార్గాన్ని బోధించడానికీ తద్వారా అబ్రాహాముకు ఆయన చెప్పిన విషయాలన్నీ జరిగించడానికీ నేను అబ్రాహామును ఎన్నుకున్నాను.”

See the chapter Copy

పవిత్ర బైబిల్

19 అబ్రాహాముతో నేను ఒక ప్రత్యేక ఒడంబడిక చేసుకున్నాను. అతని పిల్లలు, సంతానము యెహోవా ఇష్ట ప్రకారం జీవించేటట్లు అబ్రాహాము వారికి ఆజ్ఞాపించాలని నేను ఇలా చేశాను. సక్రమంగా న్యాయంగా వాళ్లు జీవించాలని నేను ఇలా చేశాను. అప్పుడు, యెహోవానైన నేను వాగ్దానం చేసిన వాటిని అతనికి ఇవ్వగలను.”

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

19 ఎందుకంటే నేను అతన్ని ఎంచుకున్నాను, అతడు తన పిల్లలను తన తర్వాత తన ఇంటివారిని యెహోవా మార్గంలో నీతి న్యాయాలు జరిగిస్తూ జీవించేలా నడిపిస్తాడు, తద్వారా యెహోవా అబ్రాహాముకు చేసిన వాగ్దానాన్ని జరిగిస్తారు.”

See the chapter Copy




ఆదికాండము 18:19

Follow us:

Advertisements


Advertisements