Online Bible

- Advertisements -

యెహెజ్కేలు 41:7 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

7 మందిరం చుట్టూ ఉన్న ఈ ప్రక్క గదులు పైకి వెళ్లే కొలది వాటి వెడల్పు ఎక్కువవుతుంది. మందిరం చుట్టూ ఉన్న గదులు క్రింది నుండి పైకి వెళ్లే కొలది ఎక్కువ వెడల్పుగా ఉండేలా అవి నిర్మించబడ్డాయి. క్రింది అంతస్తు నుండి మధ్య అంతస్తు ద్వారా పై అంతస్తు వరకు మెట్లు ఉన్నాయి.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

7 ఆ గోడ మేడగదులకు ఎక్కిన కొలది అవి మరి వెడల్పుగా పెరిగెను, పైకెక్కిన కొలది మందిరముచుట్టునున్న యీ మేడగదుల అంతస్థులు మరి వెడల్పగుచుండెను గనుక మందిరపు పైభాగము మరి వెడల్పుగా ఉండెను; పైకెక్కిన కొలది అంతస్థులు మరి వెడల్పుగా ఉండెను.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

7 ఆ గోడ మేడగదులకు ఎక్కిన కొద్దీ వాటి వెడల్పు పెరుగుతూ వచ్చింది. అంటే పైకెక్కిన కొద్దీ మందిరం చుట్టూ ఉన్న మేడగదుల అంతస్థుల వెడల్పు పెరుగుతూ వచ్చింది కాబట్టి మందిరపు పైభాగం వెడల్పు కింది భాగం కంటే ఎక్కువగా ఉంది.

See the chapter Copy

పవిత్ర బైబిల్

7 ఆలయం చుట్టూ ఉన్న గదుల ప్రతి అంతస్ధూ దానిక్రింది భాగం కంటె వెడల్పుగా ఉంది. ఆలయం చుట్టూ ఉన్న గదుల గోడలు పైకి పోను పోనూ ఇరుకు కావడం వల్ల పై అంతస్థుల గదులు విశాలంగా ఉన్నాయి. క్రింది అంతస్థు నుండి పై అంతస్థు వరకు మధ్య అంతస్తుగుండా మెట్లదారి ఉంది.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

7 మందిరం చుట్టూ ఉన్న ఈ ప్రక్క గదులు పైకి వెళ్లే కొలది వాటి వెడల్పు ఎక్కువవుతుంది. మందిరం చుట్టూ ఉన్న గదులు క్రింది నుండి పైకి వెళ్లే కొలది ఎక్కువ వెడల్పుగా ఉండేలా అవి నిర్మించబడ్డాయి. క్రింది అంతస్తు నుండి మధ్య అంతస్తు ద్వారా పై అంతస్తు వరకు మెట్లు ఉన్నాయి.

See the chapter Copy

యెహెజ్కేలు 41:7

Follow us:

Advertisements

Advertisements