ద్వితీ 15:2 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 రద్దు చేయవలసిన విధానం ఇది: తన తోటి ఇశ్రాయేలీయునికి అప్పు ఇచ్చిన ప్రతి అప్పులవాడు దానిని రద్దు చేయాలి. ఆ సంవత్సరం అప్పు తీర్చమని అడగకూడదు, ఎందుకంటే అది అప్పులు రద్దు చేయడానికి యెహోవా సమయంగా ప్రకటించబడింది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 తన పొరుగువానికి అప్పిచ్చిన ప్రతి అప్పులవాడు దానికి గడువు ఇయ్యవలెను. అది యెహోవాకు గడువు అనబడును గనుక అప్పిచ్చినవాడు తన పొరుగువానినైనను తన సహోదరునినైనను నిర్బంధింపకూడదు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 తన పొరుగువాడికి అప్పు ఇచ్చిన ప్రతివాడూ దాన్ని రద్దు చేసి వారిని విడిచిపెట్టాలి. అది యెహోవా ప్రకటించిన గడువు కాబట్టి అప్పు ఇచ్చినవాడు తన పొరుగువాడిపై లేక తన సోదరునిపై ఒత్తిడి తేకూడదు. See the chapterపవిత్ర బైబిల్2 మీరు మీ అప్పులను రద్దు చేయాల్సిన పద్ధతి యిది; మరో ఇశ్రాయేలు మనిషికి అప్పు యిచ్చిన ప్రతి ఇశ్రాయేలు వ్యక్తీ తన అప్పును రద్దుచేయాలి. ఆతడు ఒక సోదరుణ్ణి (ఇశ్రాయేలీయుని) అప్పు తిరిగి చెల్లించమని అడగ కూడదు. ఎందుకంటే ఆ సంవత్సంరలో అప్పులన్నీ రద్దు అయిపొయాయని యెహోవా ప్రకటించాడు గనుక. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 రద్దు చేయవలసిన విధానం ఇది: తన తోటి ఇశ్రాయేలీయునికి అప్పు ఇచ్చిన ప్రతి అప్పులవాడు దానిని రద్దు చేయాలి. ఆ సంవత్సరం అప్పు తీర్చమని అడగకూడదు, ఎందుకంటే అది అప్పులు రద్దు చేయడానికి యెహోవా సమయంగా ప్రకటించబడింది. See the chapter |