Online Bible

- Advertisements -




అపొస్తలుల 13:22 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

22 సౌలును తొలగించిన తర్వాత, దావీదును వారికి రాజుగా చేశాడు. దేవుడు అతని గురించి, ‘యెష్షయి కుమారుడైన దావీదును నేను కనుగొన్నాను, అతడు నా హృదయానుసారుడైన మనుష్యుడు. నేను చేయాలని ఉద్దేశాలన్నిటిని అతడు నెరవేరుస్తాడు’ అని సాక్ష్యమిచ్చారు.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

22 తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన–నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని; అతడు నా యిష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నియు నెరవేర్చునని చెప్పి అతనినిగూర్చి సాక్ష్యమిచ్చెను.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

22 తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా చేశాడు. ఆయన ‘నేను యెష్షయి కుమారుడు దావీదును నా ఇష్టానుసారమైన వానిగా కనుగొన్నాను. అతడు నా ఉద్దేశాలన్నీ నెరవేరుస్తాడు’ అని దావీదును గురించి దేవుడు సాక్షమిచ్చాడు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

22 సౌలును తీసివేసాక దావీదును వాళ్ళ రాజుగా చేసాడు. దావీదు విషయంలో తన అంగీకారం చూపుతూ దేవుడు యిలా అన్నాడు: ‘యెష్షయి కుమారుడైన దావీదు నా మనస్సుకు నచ్చాడు. అతడు నేను చెప్పినట్లు చేస్తాడు.’

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

22 సౌలును తొలగించిన తర్వాత, దావీదును వారికి రాజుగా చేశాడు. దేవుడు అతని గురించి, ‘యెష్షయి కుమారుడైన దావీదును నేను కనుగొన్నాను, అతడు నా హృదయానుసారుడైన మనుష్యుడు. నేను చేయాలని ఉద్దేశాలన్నిటిని అతడు నెరవేరుస్తాడు’ అని సాక్ష్యమిచ్చారు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదము

22 సౌలును తొలగించిన తర్వాత, దావీదును వారికి రాజుగా చేశాడు. ‘యెష్షయి కుమారుడైన దావీదును నా హృదయానుసారునిగా నేను కనుగొన్నాను. నేను చేయాలని ఉద్దేశించిన వాటన్నింటిని అతడు నెరవేర్చుతాడు’ అని దేవుడు అతని గురించి సాక్ష్యమిచ్చాడు.

See the chapter Copy




అపొస్తలుల 13:22

Follow us:

Advertisements


Advertisements