2 సమూయేలు 21:1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 దావీదు పాలనలో మూడు సంవత్సరాలు వరుసగా కరువు రాగా దావీదు యెహోవాకు మనవి చేశాడు. అందుకు యెహోవా, “సౌలు గిబియోనీయులను చంపాడు; అతడు, అతని కుటుంబం రక్తం చిందించిన కారణంగా ఈ కరువు వచ్చింది” అన్నారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 దావీదు కాలమున మూడు సంవత్సరములు విడువకుండ కరవుకలుగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఈలాగున సెలవిచ్చెను–సౌలు గిబియోనీయులను హతముచేసెను గనుక అతనినిబట్టియు, నరహంతకులగు అతని యింటివారినిబట్టియు శిక్షగా ఈ కరవు కలిగెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 దావీదు పరిపాలిస్తున్న కాలంలో మూడేళ్ళపాటు కరువు కొనసాగింది. దావీదు యెహోవాతో మనవి చేశాడు. అందుకు యెహోవా ఇలా చెప్పాడు. “సౌలు గిబియోనీయులను హతమార్చాడు. అతణ్ణి బట్టి, నరహంతకులైన అతని ఇంటివారిని బట్టి శిక్షగా ఈ కరువు ఏర్పడింది.” See the chapterపవిత్ర బైబిల్1 దావీదు కాలంలో ఒకసారి కరువు సంభవించింది. ఆ కరువు మూడు సంవత్సరాలు కొనసాగింది. దావీదు యెహోవాను ప్రార్థించాడు. దావీదు ప్రార్థన ఆలకించి యెహోవా ఇలా అన్నాడు: “సౌలు, మరియు అతని హంతకుల కుటుంబం ఈ కరువుకు కారణం. ఇప్పడీ కాటకం (కష్టం) సౌలు గిబియోనీయులను చంపివేసినందుకు వచ్చింది.” See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 దావీదు పాలనలో మూడు సంవత్సరాలు వరుసగా కరువు రాగా దావీదు యెహోవాకు మనవి చేశాడు. అందుకు యెహోవా, “సౌలు గిబియోనీయులను చంపాడు; అతడు, అతని కుటుంబం రక్తం చిందించిన కారణంగా ఈ కరువు వచ్చింది” అన్నారు. See the chapter |