Online Bible

- Advertisements -




2 దిన 21:20 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

20 యెహోరాము రాజైనప్పుడు అతని వయస్సు ముప్పై రెండు సంవత్సరాలు, అతడు యెరూషలేములో ఎనిమిది సంవత్సరాలు పరిపాలిస్తూ ఉండగా చనిపోయాడు అతని మృతికి ఎవరూ విచారపడలేదు. రాజుల సమాధుల్లో కాకుండ దావీదు పట్టణంలో అతన్ని సమాధి చేశారు.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

20 అతడు ఏలనారంభించినప్పుడు ముప్పది రెండేండ్లవాడు; యెరూషలేములో ఎనిమిది సంవత్సరములు ఏలి యెవరికిని ఇష్టము లేనివాడై అతడు చనిపోయెను; రాజుల సమాధులలో గాక దావీదు పురమందు వేరుచోట జనులు అతని పాతిపెట్టిరి.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

20 అతడు పరిపాలన చేయడం మొదలుపెట్టినప్పుడు 32 ఏళ్లవాడు. యెరూషలేములో 8 ఏళ్ళు పాలించి చనిపోయాడు. అతని మృతికి ఎవరూ విలపించలేదు. రాజుల సమాధుల్లో గాక దావీదు పట్టణంలో వేరే చోట ప్రజలు అతణ్ణి పాతిపెట్టారు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

20 యెహోరాము రాజయ్యే నాటికి ముప్పై రెండు సంవత్సరాలవాడు. అతడు యెరూషలేములో ఎనిమిది సంవత్సరాలు పాలించాడు. యెహోరాము చనిపోయినప్పుడు ఒక్కడు కూడ విచారించలేదు. యెహోరామును ప్రజలు దావీదు నగరంలో సమాధి చేశారుగాని, రాజులను వుంచే చోట అతనిని సమాధి చేయలేదు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

20 యెహోరాము రాజైనప్పుడు అతని వయస్సు ముప్పై రెండు సంవత్సరాలు, అతడు యెరూషలేములో ఎనిమిది సంవత్సరాలు పరిపాలిస్తూ ఉండగా చనిపోయాడు అతని మృతికి ఎవరూ విచారపడలేదు. రాజుల సమాధుల్లో కాకుండ దావీదు పట్టణంలో అతన్ని సమాధి చేశారు.

See the chapter Copy




2 దిన 21:20

Follow us:

Advertisements


Advertisements