Online Bible

- Advertisements -




1 సమూయేలు 25:36 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

36 అబీగయీలు తిరిగి నాబాలు దగ్గరకు వచ్చినప్పుడు, రాజులు విందు చేసినట్లు అతడు ఇంట్లో విందు చేసి, బాగా త్రాగుతూ ఆనందిస్తూ మత్తులో మునిగిపోయాడు కాబట్టి తెల్లవారే వరకు అతనితో ఆమె ఏమీ మాట్లాడలేదు.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

36 అబీగయీలు తిరిగి నాబాలునొద్దకు రాగా, రాజులు విందుచేసినట్లు అతడు ఇంటిలో విందుచేసి, త్రాగుచు బహు సంతోషించుచు మత్తుగానుండెను గనుక తెల్లవారువరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమియు చెప్పక ఊరకుండెను.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

36 అబీగయీలు తిరిగి నాబాలు దగ్గరికి వచ్చినప్పుడు, రాజుల్లాగా అతడు ఇంట్లో విందు చేసి, తప్ప తాగుతూ కులుకుతూ మత్తుగా ఉన్నాడు. అందుకని తెల్లవారే వరకూ ఆమె అతనితో ఏమాటా చెప్పలేదు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

36 అబీగయీలు తిరిగి వచ్చేసరికి నాబాలు ఇంటి వద్దనే ఉన్నాడు. నాబాలు ఒక రాజులా తింటూ ఉన్నాడు. బాగా తాగి, ఉల్లాసంగా ఉన్నాడు. అందుచేత అబీగయీలు మరుసటి రోజు ఉదయం వరకు నాబాలుతో ఏమీ చెప్పలేదు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

36 అబీగయీలు తిరిగి నాబాలు దగ్గరకు వచ్చినప్పుడు, రాజులు విందు చేసినట్లు అతడు ఇంట్లో విందు చేసి, బాగా త్రాగుతూ ఆనందిస్తూ మత్తులో మునిగిపోయాడు కాబట్టి తెల్లవారే వరకు అతనితో ఆమె ఏమీ మాట్లాడలేదు.

See the chapter Copy




1 సమూయేలు 25:36

Follow us:

Advertisements


Advertisements