1 సమూయేలు 18:27 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం27 దావీదు తన మనుష్యులను తీసుకెళ్లి రెండువందలమంది ఫిలిష్తీయులను చంపి వారి మర్మాంగ చర్మాలు తీసుకువచ్చాడు. రాజుకు అల్లుడు అవ్వడానికి కావలసిన లెక్క పూర్తి చేసి అప్పగించగా సౌలు తన కుమార్తె మీకాలును అతనికిచ్చి పెళ్ళి చేశాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)27 గడువుదాటకమునుపే లేచి తనవారితో పోయి ఫిలిష్తీయులలో రెండువందలమందిని హతముచేసి వారి ముందోళ్లు తీసికొనివచ్చి రాజునకు అల్లుడగుటకై కావలసిన లెక్క పూర్తిచేసి అప్పగింపగా సౌలు తన కుమార్తెయైన మీకాలును అతనికిచ్చి పెండ్లిచేసెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201927 గడువుకంటే ముందుగానే లేచి తన మనుషులతో వెళ్ళి ఫిలిష్తీయుల్లో 200 మందిని చంపి వారి మర్మాంగ చర్మాలు తీసుకువచ్చి, రాజుకు అల్లుడు అయ్యేందుకు అవసరమైన లెక్క పూర్తిచేసి అప్పగించాడు. సౌలు తన కుమార్తె మీకాలును అతనికిచ్చి పెళ్లి చేశాడు. See the chapterపవిత్ర బైబిల్27 దావీదు తన సైనికులతో బయలుదేరి వెళ్లి రెండువందల మంది ఫిలిష్తీయులను చంపి, వారి సున్నతి చర్మాలను తీసుకొని వచ్చి సౌలుకు ఇచ్చాడు. రాజుగారి అల్లుడు కావాలని కోరి దావీదు ఇలా చేసాడు. అప్పుడు సౌలు దావీదును తన కుమార్తె మీకాలును పెండ్లి చేసుకోనిచ్చాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం27 దావీదు తన మనుష్యులను తీసుకెళ్లి రెండువందలమంది ఫిలిష్తీయులను చంపి వారి మర్మాంగ చర్మాలు తీసుకువచ్చాడు. రాజుకు అల్లుడు అవ్వడానికి కావలసిన లెక్క పూర్తి చేసి అప్పగించగా సౌలు తన కుమార్తె మీకాలును అతనికిచ్చి పెళ్ళి చేశాడు. See the chapter |