1 రాజులు 2:24 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం24 నన్ను స్థిరపరచి, నా తండ్రియైన దావీదు సింహాసనం మీద నన్ను ఆసీనుడిగా చేసి, తన వాగ్దానం ప్రకారం నా కోసం రాజవంశాన్ని స్థాపించిన సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, అదోనియా ఈ రోజు చనిపోవలసిందే!” See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)24 నన్ను స్థిరపరచి, నా తండ్రి సింహాసనముమీద నన్ను ఆసీనునిగా చేసి, తన వాగ్దానము ప్రకారము నాకు కుటుంబము కలుగజేసిన యెహోవా జీవముతోడు, అదోనీయా యీ దినమున మరణమవునని చెప్పి See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201924 నన్ను స్థిరపరచి, నా తండ్రి సింహాసనం మీద నన్ను కూర్చోబెట్టి, తన వాగ్దానం ప్రకారం నాకు ఒక రాజవంశాన్ని కలగజేసిన యెహోవా జీవం తోడు, అదోనీయా ఈ రోజు మరణిస్తాడు” అన్నాడు. See the chapterపవిత్ర బైబిల్24 ఇశ్రాయేలు రాజు కావటానికి యెహోవా నాకు అనుమతి ఇచ్చాడు. నా తండ్రియైన దావీదు సింహాసనాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. రాజ్యాన్ని నాకు, నా ప్రజలకు ఇచ్చి యెహోవా ఆయన మాట నిలబెట్టుకున్నాడు. అదోనీయా ఈ రోజు ఖచ్చితంగా చనిపోతాడని, ఇవన్నీ నెరవేర్చిన నిత్యుడైన యోహోవా ముందు ప్రమాణం చేసి చెబుతున్నాను!” See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం24 నన్ను స్థిరపరచి, నా తండ్రియైన దావీదు సింహాసనం మీద నన్ను ఆసీనుడిగా చేసి, తన వాగ్దానం ప్రకారం నా కోసం రాజవంశాన్ని స్థాపించిన సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, అదోనియా ఈ రోజు చనిపోవలసిందే!” See the chapter |