Biblia Todo Logo
Διαδικτυακή Βίβλος

- Διαφημίσεις -




1 తిమోతి 4:12 - నొవ్వి ప్రమానుమ్

12 తుయి ఉబెడొ రితొ దాక్ జలెకి, తుక జేఁవ్ నిస్కారుమ్ నే దెకితె తుక దెక సికిత్ రితి తుయి ప్రేమ తా, ప్రబుచి ఉప్పిర్‍చి నముకుమ్‍క డిట్టుమ్ నిదానుమ్ తా, ప్రబుచి సుద్ది తా, చెంగిల్ లట్టబ్తె తా, సత్తిమ్ ఇండితె తా. తుయి దస్సి జలె, తుక దెక జేఁవ్ కి సికుల.

Δείτε το κεφάλαιο αντίγραφο




1 తిమోతి 4:12
19 Σταυροειδείς Αναφορές  

“ఈంజేఁవ్ బాలబోదల్ రితసతె ఎక్కిలొక కి నిస్కారుమ్ నే దెకితి రితి దెకన. కిచ్చొక మెలె, ఇన్నెక రకిత దూతల్ కెఁయఁక తెఁయఁక పరలోకుమ్ తిలొ అబ్బొచి మొకొమ్ దెకితె తవుల మెన ఆఁవ్ తుమ్‍క కచితుమ్ సంగితసి.


ఆఁవ్ క్రీస్తుక దెక కీసి ఇండితసి గే, తుమ్ కి అంక దెక దస్సి ఇండ.


ఆకర్‍క, బావుడ్లు, కిచ్చొ మెంతసి మెలె, సత్తిమ్ తిలిసి ఎత్కి, మరియాద తిల కమొ ఎత్కి, నాయిమ్ తిలిసి ఎత్కి, సుద్ది తిలిసి ఎత్కి, సూటి తిలిసి ఎత్కి, ‘చెంగిల్’ మెన ఎత్కిజిన్ సర్ద జతిసి ఎత్కి, కిచ్చొ జలెకి చెంగిల్‌చి, ‘చెంగిల్’ మెన దేముడు ఒప్పన్‍తిసి ఎత్కి, దసచయ్ ఎత్కిక ఉచర్తె తా, దస్సయ్ కమొ తుమ్ కెర్తె తా.


దస్సి, అమ్‍క దెక సిక తుమ్ అమ్‍చి రితి జలదు, ప్రబుచి బుద్ది దెరన్లదు. మెలె, సుబుమ్ కబుర్ తుమ్ సర్ద తెన్ సూన్‍తికయ్ మాన్సుల్ పిట్టవుక ఉచర అల్లర్ కెర్లె కి, దేముడుచి సుద్ది తిలి ఆత్మ తుమ్‍చి పెట్టి సికడ్తికయ్, జో దెతి సర్ద తెన్ తుమ్ నంపజలదు.


తుమ్‍తె అమ్ సుద్ది ఇండిలిసి, సత్తిమ్ ఇండిలిసి, వేర వాట్ నెంతె సరిగా ఇండిలిసి తుమ్ ప్రబుక నంపజలస దెక సాచుల్ జా అస్సుస్. దేముడు కి సొంత సాచి అస్సె.


అన్నె, అమ్‍చొ దేముడు ప్రబుచి ఎదివాట్ దయక యేసుక్రీస్తుక నంపజతసకయ్ దొర్కు జతి నముకుమ్ ప్రేమయ్ అంచి పెట్టి జెర్మయ్‍లన్.


తుచి కామ్‍క ‘చెంగిల్ కెర్తయ్’ మెన దేముడు ఒప్పన్‍తి రితి జోవయింక ఎక్కి నిదానుమ్ జంక తుయి ఎక్కి ఆస జా, డొంగ్రె సోగ వాటు గగ్గడ్తి రితి, సూన్‍తస పూర్తి అర్దుమ్ కెరంతి రితి, దేముడుచి సుబుమ్ కబుర్ సరిగా సిక్కడు. దస్సి నిదానుమ్ తిలె, తుక జో దిలి కామ్‍క ‘నిదానుమ్ కెర్లయ్’ మెనయ్ తుయి లాజ్ జంక నాయ్.


జాకయ్, బుద్ది నెంజిల ఉబెడల్ జత ఆసల్‍క తుయి దూరి తా, సుద్ది ఆత్మ తెన్ ప్రబుక ఎక్కి నిదానుమ్ తా జోవయించి నావ్ దెర్తస ఎత్కిజిన్ తెన్, సత్తిమ్‍బుద్ది, నిదానుమ్‍చి నముకుమ్, ప్రేమ, సేంతుమ్‍కయ్, జేఁవ్ తుయి కోర్‍ప జతె తా.


ఆఁవ్ ఇన్నె రెగిడ్ల టాలివొచి రిసొ చెంగిల్ ఉచరు. తుయి పూర్తి అర్దుమ్ కెరంతి రితి ప్రబు తుక సికడెదె.


జలె, తీతు, ఈంజ ఎత్కి తుయి సికడ్తె తా. ఒత్తచ నంపజలస సత్తిమ్ ఇండుక అన్నె నిదానుమ్ సికిత్ రితి, ప్రబు తుక దిలి అదికారుమ్ తెన్ జోవయించ తప్పుల్ జోవయింక దెకవు, చి జేఁవ్ బుద్ది జతి రితి జోవయింక సత్తిమ్ దెకవ దయిరిమ్ నిదానుమ్ సంగు. జా ఎత్కితె తుక కో నిస్కారుమ్ నే దెకిత్ రితి గని తుక మరియాద దెకిత్ రితి తుచి కామ్ కెరు ఇండు.


అన్నె, జేఁవ్ తుచ కమొ దెక సికిత్ రితి చెంగిల కమొ కిచ్చొ జలెకి నిదానుమ్ కెర్తె తా. అన్నె, తుయి బోదన కెర్తిస్‍తె సత్తిమ్‍బుద్ది చి మరియాద దెకవు.


తుమ్‍తె కక్కయ్ బుద్ది గ్యానుమ్? ‘అంకయ్ గ్యానుమ్’ మెన కో ఉచరన్లె, జా గ్యానుమ్‍తె బెదితి బుద్ది తెన్, గవురుమ్ నే ఉచరంతె, జా గ్యానుమ్‍తె బెదిత కమొ ఇండ రుజ్జు దెకవుసు.


గని పరలోకుమ్ తెంతొ అయ్‍లి గ్యానుమ్, ప్రబుచి సుద్ది తెన్, సేంతుమ్ బుద్ది తెన్, మెత్తన బుద్ది తెన్, సొంత ఇస్టుమ్ జర్గు కెరుక ఒగ్గర్ నే తతె, వేర మాన్సుల్‍చి కోడు మరియాద తెన్ సూన్‍తి బుద్ది తెన్ తా, కిచ్చొయ్ ఉప్రమెన్సు నెంతె తయెదె.


పడ్తొ, జా మందతెచ మాన్సుల్‍క బియడ్తి రగుమ్ ఏలుప కెర నాయ్, గని జేఁవ్ కీసి సత్తిమ్ ఇండుక గే దెకిత్ రితి తూమ్ దస్సి సత్తిమ్ ఇండ దెకవ.


Ακολουθησε μας:

Διαφημίσεις


Διαφημίσεις