Online Bibel

- Annoncer -




2 సమూయేలు 20:3 - పవిత్ర బైబిల్

3 దావీదు యెరూషలేములోని తన ఇంటికి వచ్చాడు. గతంలో దావీదు తన ఉపపత్నులను పది మందిని ఇల్లు చక్కదిద్దేందుకై వదిలి వెళ్లాడు. ఇప్పుడు దావీదు ఈ స్త్రీలను ఒక ప్రత్యేకమైన ఇంటిలో వుంచాడు. ఆ ఇంటికి సైనిక కాపలా ఏర్పాటు చేశాడు. ఆ స్త్రీలు తమ జీవితాంతం ఆ ఇంటిలోనే వుండిపోయారు. దావీదు వారికి ఆహారాదులిచ్చాడు గాని, వారితో సాంగత్యం చేయలేదు. వారి మరణ పర్యంతం ఆ స్త్రీలు విధవరాండ్రవలె జీవించారు.

Se kapitlet Kopi

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 దావీదు యెరూషలేము లోని తన నగరికి వచ్చి, తన యింటికి తాను కాపుగా నుంచిన తన ఉపపత్నులైన పదిమంది స్త్రీలను తీసికొని వారిని కావలిలో ఉంచి వారిని పోషించుచుండెనుగాని వారియొద్దకు పోకుండెను; వారు కావలియందుంచబడిన వారై బ్రతికినంతకాలము విధవరాండ్రవలె ఉండిరి.

Se kapitlet Kopi

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 దావీదు యెరూషలేములోని తన నగరానికి వచ్చాడు. తన ఇంటికి కాపలాగా ఉంచిన తన ఉపపత్నులు పదిమంది స్త్రీలను కాపాడుతూ వారిని పోషిస్తున్నాడు గానీ వారితో లైంగిక సంబంధం పెట్టుకోలేదు. వారు కాపలాలో ఉండి జీవించినంత కాలం వితంతువుల వలె ఉండిపోయారు.

Se kapitlet Kopi

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 రాజైన దావీదు యెరూషలేములో తన భవనానికి వచ్చి ఆ భవనాన్ని చూసుకోవడానికి ఉంచిన పదిమంది ఉంపుడుగత్తెలను తీసుకెళ్లి కాపలా ఉన్న ఇంట్లో పెట్టి వారిని పోషించాడు కాని వారితో ఎలాంటి లైంగిక సంబంధం పెట్టుకోలేదు. వారు చచ్చే వరకు విధవరాండ్రుగా జీవించారు.

Se kapitlet Kopi

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 రాజైన దావీదు యెరూషలేములో తన భవనానికి వచ్చి ఆ భవనాన్ని చూసుకోవడానికి ఉంచిన పదిమంది ఉంపుడుగత్తెలను తీసుకెళ్లి కాపలా ఉన్న ఇంట్లో పెట్టి వారిని పోషించాడు కాని వారితో ఎలాంటి లైంగిక సంబంధం పెట్టుకోలేదు. వారు చచ్చే వరకు విధవరాండ్రుగా జీవించారు.

Se kapitlet Kopi




2 సమూయేలు 20:3

Følg os:

Annoncer


Annoncer