1 రాజులు 1:25 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం25 ఈ రోజు అతడు వెళ్లి విస్తారమైన పశువులను, క్రొవ్విన దూడలను, గొర్రెలను బలి ఇచ్చాడు. రాజకుమారులందరినీ, సేనాధిపతులను, యాజకుడైన అబ్యాతారును ఆహ్వానించాడు. ఇప్పుడు వారు అతనితో తింటూ త్రాగుతూ, ‘రాజైన అదోనియా చిరకాలం జీవించు గాక!’ అని అంటున్నారు. Se kapitletపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)25 ఏలయనగా ఈ దినమున అతడు పోయి విస్తారమైనయెడ్లను క్రొవ్వినదూడలను గొఱ్ఱెలను బలిగా అర్పించి రాజకుమారులనందరిని సైన్యాధిపతులను యాజకుడైన అబ్యాతారును పిలిపింపగా వారు వాని సముఖములో అన్నపానములు పుచ్చుకొనుచు–రాజైన అదోనీయా చిరంజీవి యగునుగాక అని పలుకుచున్నారు. Se kapitletఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201925 ఎందుకంటే, ఈ రోజు అతడు అసంఖ్యాకంగా ఎద్దులనూ కొవ్విన దూడలనూ గొర్రెలనూ బలిగా అర్పించి రాకుమారులందరినీ సైన్యాధిపతులనూ యాజకుడు అబ్యాతారునూ పిలిచాడు. వారంతా అతని దగ్గర ఉండి అన్నపానాలు తీసుకుంటూ, ‘రాజైన అదోనీయా చిరంజీవి అవుతాడు గాక’ అని పలుకుతున్నారు. Se kapitletపవిత్ర బైబిల్25 ఈ రోజు అతను సమాధాన బలులు అర్పించాడు. అతడు చాలా ఆవులను, బలిసిన కోడెదూడలను, గొర్రెలను చంపాడు. నీ యొక్క ఇతర కుమారులనందరిని, సైన్యాధ్యక్షుడిని, యాజకుడైన అబ్యాతారును అతడు పిలిచాడు. ఈ సమయంలో వారంతా అతనితో కలిసి తాగుతూ, తింటూ వేడుక చేసుకొంటున్నారు. పైగా, ‘రాజైన అదోనీయా వర్ధిల్లు గాక!’ అని వారంతా అంటున్నారు. Se kapitletతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం25 ఈ రోజు అతడు వెళ్లి విస్తారమైన పశువులను, క్రొవ్విన దూడలను, గొర్రెలను బలి ఇచ్చాడు. రాజకుమారులందరినీ, సేనాధిపతులను, యాజకుడైన అబ్యాతారును ఆహ్వానించాడు. ఇప్పుడు వారు అతనితో తింటూ త్రాగుతూ, ‘రాజైన అదోనియా చిరకాలం జీవించు గాక!’ అని అంటున్నారు. Se kapitlet |