Online Bible

- Reklamy -

యోవేలు 2:20 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

20 “నేను ఉత్తర దిక్కునుండి వచ్చే సైన్యాన్ని మీకు దూరంగా తరిమివేస్తాను. ఎండిపోయిన, నిస్సారమైన ప్రాంతానికి దానిని పంపివేస్తాను; తూర్పు వైపున్న దాని సైన్యం మృత సముద్రంలో మునిగిపోతుంది, పశ్చిమ వైపున్న దాని సైన్యం మధ్యధరా సముద్రంలో మునిగిపోతుంది. అది కంపు కొడుతుంది, దాని దుర్వాసన లేస్తుంది.” నిజంగా ఆయన గొప్పకార్యాలు చేశారు!

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

20 మరియు ఉత్తరదిక్కునుండి వచ్చువాటిని మీకు దూరముగా పార దోలి, యెండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేతును; అవి గొప్ప కార్యములు చేసెను గనుక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రములోకిని, వెనుకటి భాగమును పడమటి సముద్రములోకిని పడగొట్టుదును; అక్కడ వాటి దుర్గంధము లేచును అవి కుళ్లు వాసన కొట్టును.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

20 ఉత్తర దిక్కు నుంచి వచ్చే సేనను మీకు దూరంగా పారదోలతాను. వారిని ఎండిపోయి, పాడైపోయిన ప్రాంతానికి తోలివేస్తాను. దాని ముందు భాగాన్ని తూర్పు సముద్రంలో, దాని వెనుక భాగాన్ని పడమటి సముద్రంలో పడేస్తాను. అది కంపు కొడుతుంది, చెడ్డవాసన వస్తుంది. నేను గొప్ప పనులు చేస్తాను.”

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

20 లేదు. ఆ ఉత్తరపు ప్రజలను మీ దేశంనుండి వెళ్ళగొడతాను. ఎండిపోయిన ఖాళీ దేశానికి వారు వెళ్ళేటట్టు నేను చేస్తాను. వారిలో కొందరు తూర్పు సముద్రానికి వెళ్తారు. మరి కొందరు పడమటి సముద్రానికి వెళ్తారు. ఆ ప్రజలు అంత భయంకరమైన పనులు చేశారు. కాని వారు చచ్చి కుళ్ళిపోతున్న దానిలా ఉంటారు. అక్కడ భయంకరమైన కంపు కొడుతుంది!”

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

20 “నేను ఉత్తర దిక్కునుండి వచ్చే సైన్యాన్ని మీకు దూరంగా తరిమివేస్తాను. ఎండిపోయిన, నిస్సారమైన ప్రాంతానికి దానిని పంపివేస్తాను; తూర్పు వైపున్న దాని సైన్యం మృత సముద్రంలో మునిగిపోతుంది, పశ్చిమ వైపున్న దాని సైన్యం మధ్యధరా సముద్రంలో మునిగిపోతుంది. అది కంపు కొడుతుంది, దాని దుర్వాసన లేస్తుంది.” నిజంగా ఆయన గొప్పకార్యాలు చేశారు!

Viz kapitola kopírovat

యోవేలు 2:20

Následuj nás:

Reklamy

Reklamy