యెహెజ్కేలు 35:11 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 కాబట్టి నా జీవం తోడు నీవు వారిమీద ద్వేషంతో నీవు వారికి చూపించిన కోపం అసూయను బట్టి నేను నీ పట్ల తగిన రీతిగా వ్యవహరిస్తాను. నేను నిన్ను శిక్షించినప్పుడు నన్ను నేను వారికి పరిచయం చేసుకుంటాను అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 నా జీవముతోడు నీవు వారి యెడల పట్టిన పగవలన వారికి చూపిన అసూయచొప్పునను క్రోధము చొప్పునను నేను నీకు తగిన పనిచేసి, నిన్ను శిక్షించుటవలన వారికి నన్ను నేనే తెలియపరచుకొందును. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 నా జీవం తోడు నువ్వు పగ పట్టి వారి పట్ల చూపిన అసూయకూ కోపానికీ నేను తగిన విధంగా నీ పట్ల వ్యవహరిస్తాను. నిన్ను శిక్షించేటప్పుడు వారికి నన్ను నేనే తెలియపరచుకుంటాను. అయితే నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు. Viz kapitolaపవిత్ర బైబిల్11 నా ప్రభువైన యెహోవా ఇలా చెపుతున్నాడు, “నీవు నా ప్రజల పట్ల అసూయచెంది ఉన్నావు. నీవు వారిపట్ల కోపంతో ఉన్నావు. నీవు వారిని అసహ్యించుకున్నావు. నీవు వారిని బాధించిన విధంగా నేను నిన్ను శిక్షిస్తానని నామీద ప్రమాణం చేసి చెపుతున్నాను! నేను నిన్ను శిక్షించి, నేను నా ప్రజలతోనే ఉన్నానని వారు తెలుసుకొనేలా చేస్తాను. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 కాబట్టి నా జీవం తోడు నీవు వారిమీద ద్వేషంతో నీవు వారికి చూపించిన కోపం అసూయను బట్టి నేను నీ పట్ల తగిన రీతిగా వ్యవహరిస్తాను. నేను నిన్ను శిక్షించినప్పుడు నన్ను నేను వారికి పరిచయం చేసుకుంటాను అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు. Viz kapitola |