1 రాజులు 18:10 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 సజీవుడైన మీ దేవుడు, యెహోవా పేరిట ప్రమాణం చేస్తున్నాను, నా యజమాని అహాబు మీకోసం వెదకడానికి అన్ని దేశాలకు, రాజ్యాలకు మనుష్యులను పంపాడు. ఏ దేశం వారైనా ఏలీయా లేడని చెప్పినప్పుడు మిమ్మల్ని ఆ దేశం వారు చూడలేదని వారి చేత ఒట్టు పెట్టించుకున్నాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 నీ దేవుడైన యెహోవా జీవముతోడు నిన్ను చిక్కించుకొనవలెనని నా యేలినవాడు దూతలను పంపించని జనమొకటైనను లేదు, రాజ్యమొకటైనను లేదు; అతడు ఇక్కడ లేడనియు, అతని చూడలేదనియు, వారు ఆయా జనములచేతను రాజ్యములచేతను ప్రమాణము చేయించుచు వచ్చిరి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 నీ దేవుడు యెహోవా ప్రాణం తోడు, నిన్ను పట్టుకోవాలని నా యజమాని వార్తాహరులను పంపించని దేశం గానీ రాజ్యం గానీ లేదు. ‘ఏలీయా ఇక్కడ లేడు’ అని ఆ దేశం గానీ రాజ్యం గానీ అంటే వారితో అలా ప్రమాణం చేయించుకునేవాడు. Viz kapitolaపవిత్ర బైబిల్10 నీ దేవుడైన యెహోవా సాక్షిగా చెబుతున్నాను. రాజు నీ కొరకై ప్రతి చోటా చూస్తూన్నాడు! నిన్ను వెదకమని తన మనుష్యులను అన్ని దేశాలకు పంపాడు. ఏ పాలకుడైనా తన దేశంలో నీవు లేవని చెపితే అహాబు అంతటితో ఆగక నీవతని రాజ్యంలో లేవని ప్రమాణం చేయమని బలవంతపెట్టు తున్నాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 సజీవుడైన మీ దేవుడు, యెహోవా పేరిట ప్రమాణం చేస్తున్నాను, నా యజమాని అహాబు మీకోసం వెదకడానికి అన్ని దేశాలకు, రాజ్యాలకు మనుష్యులను పంపాడు. ఏ దేశం వారైనా ఏలీయా లేడని చెప్పినప్పుడు మిమ్మల్ని ఆ దేశం వారు చూడలేదని వారి చేత ఒట్టు పెట్టించుకున్నాడు. Viz kapitola |