న్యాయాధి 12:6 - పవిత్ర బైబిల్6 “షిబ్బోలెతు అనే మాట పలుకు” అని వారు అంటారు. ఎఫ్రాయిము మనుష్యులు ఆ మాటను సరిగ్గా పలుకలేరు. వారు ఆ మాటను “సిబ్బోలెతు” అని పలుకుతారు. కనుక అటువంటి వారిని ఒకడు “సిబ్బోలెతు” అని చెబితే అతడు ఎఫ్రాయిము వాడని గిలాదు వారికి తెలిసిపోతుంది. కనుక ఆ రేవు దగ్గరే వారు చంపేస్తారు. అలాగున వారు నలభై రెండువేల మంది ఎఫ్రాయిము మనుష్యులను చంపివేశారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 అందుకతడు–నేను కాను అనినయెడల వారు అతని చూచి–షిబ్బోలెతను శబ్దము పలుకుమనిరి. అతడు అట్లు పలుకనేరక సిబ్బోలెతని పలుకగా వారు అతని పట్టుకొని యొర్దానురేవులయొద్ద చంపిరి. ఆ కాలమున ఎఫ్రాయి మీయులలో నలువది రెండువేలమంది పడిపోయిరి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 అందుకతను “కాదు” అంటే, వాళ్ళు అతన్ని చూసి “షిబ్బోలెత్” అనే మాట పలకమన్నారు. అతడు పలకలేక “సిబ్బోలెత్” అని పలికితే, వాళ్ళు అతన్ని పట్టుకుని యొర్దాను రేవుల దగ్గర చంపేశారు. ఆ సమయంలో ఎఫ్రాయిమీయుల్లో నలభై రెండు వేల మంది చనిపోయారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 వారు, “సరే, ‘షిబ్బోలెత్’ అని పలుకు” అనేవారు. అతడు, ఆ పదం సరిగా పలుకలేక, “సిబ్బోలెతు” అని పలికితే, వారు అతన్ని పట్టుకుని యొర్దాను రేవు దగ్గర చంపేవారు. ఆ కాలంలో నలభై రెండువేలమంది ఎఫ్రాయిమీయులు చంపబడ్డారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 వారు, “సరే, ‘షిబ్బోలెత్’ అని పలుకు” అనేవారు. అతడు, ఆ పదం సరిగా పలుకలేక, “సిబ్బోలెతు” అని పలికితే, వారు అతన్ని పట్టుకుని యొర్దాను రేవు దగ్గర చంపేవారు. ఆ కాలంలో నలభై రెండువేలమంది ఎఫ్రాయిమీయులు చంపబడ్డారు. Viz kapitola |