ఆదికాండము 31:54 - పవిత్ర బైబిల్54 అప్పుడు యాకోబు ఒక పశువును వధించి, ఆ కొండమీద దానిని బలిగా అర్పించాడు. భోజనంలో పాలు పుచ్చుకోమని అతడు తన వాళ్లను పిల్చాడు. భోజనం చేసి, ఆ రాత్రికి వారు ఆ కొండమీదనే గడిపారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)54 యాకోబు ఆ కొండమీదబలి యర్పించి భోజనము చేయుటకు తన బంధువులను పిలువగా వారు భోజనముచేసి కొండమీద ఆ రాత్రి వెళ్లబుచ్చిరి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201954 యాకోబు ఆ కొండ మీద బలి అర్పించి భోజనం చేయడానికి తన బంధువులను పిలిచినప్పుడు వారు భోజనం చేసి కొండ మీద ఆ రాత్రి గడిపారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం54 అతడు ఆ కొండమీద బలి అర్పించి, బంధువులను భోజనానికి పిలిచాడు. వారు భోజనం చేసిన తర్వాత ఆ రాత్రి అక్కడే గడిపారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం54 అతడు ఆ కొండమీద బలి అర్పించి, బంధువులను భోజనానికి పిలిచాడు. వారు భోజనం చేసిన తర్వాత ఆ రాత్రి అక్కడే గడిపారు. Viz kapitola |